కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పంకజ్ వినోద్
హనుమకొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : అరుదైన, క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడంలో యశోద హాస్పిటల్స్ (Yashoda Hospitals) ముందంజలో ఉన్నాయని, యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పంకజ్ వినోద్ తెలిపారు.
హనుమకొండలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యశోద హాస్పిటల్స్‌లోని మల్టీ డిసిప్లినరీ హార్ట్ టీమ్ ద్వారా, శస్త్రచికిత్స చేయడం అత్యంత ప్రమాదకరమని భావించిన రోగులకు, అలాగే గుండె నిర్మాణం క్లిష్టంగా ఉన్న పేషెంట్లకు కాంప్లెక్స్ ట్రాన్స్‌కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ (TAVR), అడ్వాన్స్డ్ కాంప్లెక్స్ కోరోనరీ యాంజియోప్లాస్టీ వంటి అత్యాధునిక ప్రక్రియలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మినిమల్లీ ఇన్వేసివ్, కాథెటర్ ఆధారిత చికిత్సలు ఎంపిక చేసిన రోగులకు సమర్థవంతమైన ఫలితాలను అందించడమే కాకుండా, త్వరగా కోలుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయని చెప్పారు.
తీవ్రమైన అయోర్టిక్ వాల్వ్ వ్యాధి, అడ్వాన్స్డ్ కోరోనరీ ఆర్టరీ వ్యాధులు, ముఖ్యంగా వృద్ధులు, ఇతర అనుబంధ ఆరోగ్య సమస్యలు ఉన్న రోగుల్లో హార్ట్ ఫెయిల్యూర్‌కు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని డాక్టర్ పంకజ్ వినోద్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ ఓపెన్ హార్ట్ సర్జరీ అత్యంత ప్రమాదకరమవుతుందని, యశోద హాస్పిటల్స్ వంటి అనుభవజ్ఞులైన కేంద్రాల్లో ఈ ఆధునిక కాథెటర్ ఆధారిత చికిత్సలు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా మారుతున్నాయని తెలిపారు.
ఈ చికిత్సలు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు, కార్డియాక్ సర్జన్లు, ఇమేజింగ్ నిపుణులు, క్రిటికల్ కేర్ వైద్యులు కలసి పనిచేసే ప్రత్యేక ‘హార్ట్ టీమ్’ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని చెప్పారు. సిటీ స్కాన్, ఎకోకార్డియోగ్రఫీ, IVUS లేదా OCT వంటి ఆధునిక ఇమేజింగ్ పరికరాల సహాయంతో వాల్వ్ అమరిక, స్టెంట్ ప్రతిష్టాపన అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహిస్తున్నామని వివరించారు.
ప్రస్తుతం చాలామంది రోగులు ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా సాధారణ శస్త్రచికిత్స చేయించుకోలేని క్లిష్ట పరిస్థితుల్లో ఉంటున్నారని, సరైన రోగుల ఎంపికతో పాటు సమన్వయంతో కూడిన టీమ్ వర్క్ ద్వారా రిస్క్‌ను తగ్గించి, వారి రికవరీని వేగవంతం చేస్తున్నామని డాక్టర్ పంకజ్ వినోద్ తెలిపారు.





