– పర్యాటక దినోత్సవంలో తెలంగాణ టూరిజమ్ ఎక్సెలెన్స్ అవార్డ్
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి మరో అరుదైన కీర్తి దక్కింది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవంలో భాగముగా తెలంగాణ టూరిజమ్ ఎక్సెలెన్స్ అవార్డ్ దక్కించుకున్న తొలి పుణ్యక్షేత్రంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఎంపికయింది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం సాంప్రదాయ వేదికగా శిల్పారామంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా యాదగిరిగుట్ట ఆలయ ఇన్చార్జ్ ఈవో జి.రవి, ఐ.ఎ.ఎస్ మరియు ఎ ఇ ఓ లు శ్రీ జూశెట్టి కృష్ణ , శ్రీ గజవెల్లి రఘు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయ ఇన్చార్జ్ ఈవో జి.రవి మాట్లాడుతూ యాదగిరిగుట్ట దేవస్థానానికి ఈ అవార్డు వచ్చే విధంగా ఎంపిక చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ యాదగిరిగుట్ట దేవస్థానం ఉద్యోగుల తరఫున సంతోషం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





