యాదగిరిగుట్ట నూతన ఈవోగా భవానీశంకర్

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 29: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ఈవోగా భవానీశంకర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా కొండ కింద కళ్యాణ కట్ట వద్ద స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం ప్రధాన ఆలయంలో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు కుటుంబ సమేతంగా గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా స్వామివారి లడ్డూప్రసాదం, స్వామి వారి ఫోటోను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భాస్కర్ అందజేశారు.

డాలర్లు మాయం.. విచారణ తర్వాత చర్యలు : ఈవో భవానీశంకర్

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రచార శాఖలో విక్రయించే బంగారు, వెండి డాలర్లు మాయమయ్యాయి. వీటి ఖరీదు లక్షలలో ఉంటుందని అంచనా. ఇవి ఏడాది క్రితమే మాయం కాగా ఇటీవల ఆడిట్ అధికారులు తనిఖీలు నిర్వహించి బంగారం, వెండి డాలర్లు మాయమైనట్టు ధ్రువీకరించారు. ఈ ఘటనపై ఆలయ ఈవో భవానీశంకర్ దేవస్థాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ డాలర్ చోరీపై ఎంక్వైరీ కమిటీ వేస్తామని, కమిటీ నివేదిక అనంతరం తప్పు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *