యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జులై 23: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బుధవారం 41 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు. కొండ కింద గల సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో అత్యంత భద్రత నడుమ స్వామి వారి హుండీ లెక్కింపు కొనసాగింది. హుండీ ఆదాయం రూ.2,45,48,023 వచ్చినట్లు ఆలయ ఈవో వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు. మిశ్రమ బంగారం 38 గ్రాములు రాగా మిశ్రమ వెండి 2.800 కిలోలు వచ్చిందన్నారు. విదేశీ కరెన్సీ విరాళంగా అమెరికా డాలర్లు 1036. ఆస్ట్రేలియా డాలర్లు 5, ఇంగ్లాండ్ పౌండ్స్ 45. సౌదీ అరేబియన్ 5 రియాల్. సింగపూర్ డాలర్లు 10. ఖతర్ 1/2 రియాల్. ఒమన్ 500 బైస. అరబ్ ఎమిరేట్స్ 70 థీరమ్స్. శ్రీలంక 500, మలేసియా 23 రింగిట్స్. కెనడా డాలర్సు 20, బహ్రెయిన్ 2 రూపాయ ఆదాయం వచ్చినట్టు ఈవో వెంకట్రావు తెలిపారు.
యాదాద్రీశుడి హుండీ ఆదాయం రూ2.45 కోట్లు


