యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 13: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో కొనసాగుతున్న ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు గోదా అమ్మవారి నీరాట్టోత్సవలు ఆలయంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఆలయ అర్చకులు గోదా అమ్మవారికి పంచామృతాలతో నవ కలశ సన్నపనం నిర్వహించారు తదుపరి లక్ష్మి నరసింహ స్వామి గోదా అమ్మవారి సేవలను తిరు మాడవీధులలో ఊరేగింపు చేశారు.మధ్యాహ్నం తిరుప్పావై మంటపములో తిరువారాధన ఆరగింపు చేసి తీర్థప్రసాదాలను అందజేశారు .ఈ ఉత్సవాలలో ఆలయ అధికారులు ఆలయ అర్చకులు సిబ్బంది స్థానికులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




