యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో వార్షిక కణ్ణన్ శ్రీవైష్ణవ తిరునక్షత్రోత్సవం శ్రీజయంతిని పురస్కరించుకొని సోమవారం ఉదయం విశేష కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీలక్ష్మీనారసింహస్వామికి, కృష్ణ భగవానునికి విశేష తిరుమంజన, నవకలశ స్నపనము ,లక్ష్మీనారసింహ మహాలక్ష్మీ సుదర్శన-వాసుదేవ-మూలమంత్ర హవన కార్యక్రమాలను వేదపండితులు ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమాలు ఆలయంలోని అద్దాల మండపము ముందు జరిగాయి. సాయంత్రం కణ్ణన్ తిరునక్షత్రం నిర్వహించి విశేష భోగ ప్రసాదములు నివేదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




