– నిర్వాహకులకు కెనడా ప్రధాని ప్రశంసలు
– దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హర్షం
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : తెలంగాణలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సేవలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కెనడాలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో భక్తులకు అందుతున్న సేవలపై äలయ కమిటీని కెనడా ప్రధాని మార్క్ కార్నీ అభినందించారు. ఈ మేరకు ఆదివారం యాదగిరిగుట్ట ఆలయానికి ఆయన రాసిన లేఖ చేరింది. కెనడాలోని ఒట్టావా నగరంలో గల శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఇటీవల జరిగిన స్వామి వారి కల్యాణం తీరుతెన్నులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారని కొనియాడారు. ఈ సందర్భంగా హిందూ సంస్కృతిలోని విభిన్నత, ఆధ్యాత్మికత, ఐక్యతను ప్రశంసించారు. కెనడాలోని హిందూ భక్తులను ఐక్యం చేస్తూ దైవ సంబంధిత కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. కాగా, కెనడా ప్రధాని లేఖపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, యాదాద్రి ఆలయ ఈవో వెంకటరావు హర్షం వ్యక్తం చేశారు. స్వామి వారి సేవలను రానున్న రోజుల్లో భక్తులకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





