Yadagirigutta : యాదగిరిగుట్టలో ముగిసిన పవిత్రోత్సవాలు

– భక్తులకు పవిత్ర మాలలు అందజేసిన అర్చకులు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 6: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో(Lakshmi Narasimhaswamy Temple)  సోమవారం ప్రారంభమైన పవిత్రోత్సవాలు బుధవారం ముగిసాయి.
స్వయంభూ పంచ-నారసింహ స్వామి క్షేత్రంలో స్వామి ప్రధాన ఆలయంలో అత్యంత వైభవంగా ఈ పవిత్రోత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం ద్వారతోరణ, ధ్వజకుంభారాధన, చతుఃస్థానార్చన, మూల మంత్ర, పరివార శాంతి, ప్రాయశ్చిత్త హోమాలు, శాలబలి, మహాపూర్ణాహుతి, పవిత్రావరోహణం, మహాకుంభ ప్రోక్షణం, ఆచార్యాది రిత్విక్‌ సన్మానం. యజమానులకు వేదాశీర్వచనంతో ఉత్సవ పరిసమాప్తి మొదలగు వేడుకలను ఆలj ుప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అర్చకులు, వేద పండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఆలయ కార్యనిర్వహణాధికారి (EO) ఎస్‌.వెంకటరావు. ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి. ఉప కార్యనిర్వహణాధికారి, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వ్రామివారిని దర్శించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *