యాదగిరిగుట్టలో లక్ష పుష్పార్చన 

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జులై 21: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు నిత్య పూజల అనంతరం ఆలయ ముఖ మండపంలో బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. రంగు రంగుల పూలతో ఆలయ అర్చకులు లక్ష పుష్పార్చనను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *