30 మంది విదేశీ ప్ర‌తినిధుల యాదాద్రి సంద‌ర్శ‌న‌

-ల‌క్షీన‌ర‌సింహ‌స్వామి ద‌ర్శ‌నం
– ఆల‌య సంప్ర‌దాయాల‌తో స్వాగ‌తం
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారిని సోమ‌వారం 25 దేశాల నుండి వచ్చిన 30 మంది ప్రతినిధులు ద‌ర్శించుకున్నారు. భారత విదేశాంగ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న‌ట్రైనింగ్ ఆఫ్ మీడియా మేనేజ్‌మెంట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వీరు  స్వామివారిని దర్శించుకున్నారు. ఈ బృందంలో శ్రీలంక, వియత్నం, థాయిలాండ్, ఈజీప్ట్, అర్మేనియా, కెన్య, ఘనా, జాంబియా, నమీబియా, లైబరియ,ఇరాక్, పాలస్తీనా, టాంజనియ, మారిషియస్, క్యూబా, నమిబియా, డోమినికన్, మొదలగు దేశముల నుండి ప్రతినిధులు స్వామి వారి దర్శనం చేసుకున్నారు. వీరికి ఆలయ సిబ్బంది  సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామి వారి లడ్డు ప్రసాదం అందజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *