జ‌గ‌న్మోహిని అవ‌తారంలో యాదాద్రి స్వామి

-కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
-వైభవంగా స్వామి వారి  ఎదుర్కోలు మహోత్సవం
-ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: బ్రహ్మోత్సవాల్లో భాగంగా  మంగళవారం ఉదయం  స్వామి వారి ఆలయాల్లో నిత్యారాధనల అనంతరం స్వామి వారిని జగన్మోహిని ఆకారంలో అలంకరించి ఆలయ మాడవీధులలో ఊరేగింపు నిర్వహించారు. తూర్పు రాజగోపురం ముందు ప్రధాన అర్చకులు ఉప ప్రధానార్చకులు అర్చకులు స్వామివారి వైభవాన్ని జగన్మోహిని  అలంకార విశేషాలను భక్తులకు వివరించారు. క్షీరసాగర మథనం జరిగే సమయంలో, శ్రీహరి జగన్మోహినిగా అవతరించి రాక్షసులను తన మాయామోహ పరవశంలో పడవేస్తూ, దేవతలకు అమృతమును అందించిన తీరు ఎంతో మనోహరం. జగత్తు అంతా మాయా మోహమని, ఎవరైతే మోహమును త్యజిస్తారో వారికి అమృతత్త్వము అందుతుంద‌న్న సందేశాన్నిచ్చేదే జ‌గన్మోహిని అలంకారం. కాగా  సాయంకాలము  గం. 8-00లకు స్వామి వారిని అశ్వ వాహనారూఢునిగా అలంకరించి స్వామివారి ఎదుర్కోలు మహోత్సవాన్ని నిర్వ‌హించారు.  ఈ వేడుకలో ఆలయ అధికారులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆశ్వము చపలత్వమునకు ఇంద్రియములకు ప్రతీక. మానవుడు చపల చిత్తమును వదలి, ఇంద్రియ నిగ్రహము కలిగిన నాడే, మోక్షసిద్ధి కలుగుతుంద‌ని అశ్వ‌వాహ‌నారూఢిని అవ‌తారం వెల్ల‌డిస్తుంది. ఈ వేడుకలలో ఆలయ ఆనువంశిక ధర్మకర్త  బి.నరసింహ మూర్తి , ఆలయ కార్యనిర్వహణాధికారి భవాని శంకర్ ఐఏఎస్ , డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవోలు గజవెల్లి రఘు.ఆలయ అధికారులు ఆలయ సిబ్బంది,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకుని సేవించుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *