– మండలిలో బీఆర్‌ఎస్ సభ్యుడు రమణ డిమాండ్
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి2:ఉత్తర తెలంగాణలో అతిపెద్ద దేవాలయం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ యాదాద్రి ఆలయం మాదిరిగానే వేములవాడ, కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేయాలని కేసీఆర్ భావించారని తెలిపారు. అందుకే ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తూ జీవో కూడా ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కొండగట్టు ఆలయ పనులను నిలిపివేసిందని విమర్శించారు. ఈ జీవో నిలుపుదలపై సమీక్ష చేశారా లేదా అని ప్రశ్నించారు. కొండగట్టు ఆలయ పరిధిలోకి 600 ఎకరాల భూమిని తెచ్చారని, కానీ ప్రొసీడింగ్స్ అమలు చేయడం లేదని రమణ తెలిపారు. ఘాట్ రోడ్డు నిర్మాణం, పలు అభివృద్ధి పనుల కోసం రూ.500 కోట్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారని అన్నారు. ఆ పనులను వెంటనే పునరుద్ధరించాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.