యాదాద్రీశుడిని దర్శించుకున్న ప్రిన్సిపల్‌ సెక్రటరి

– ఆలయ అభివృద్ధిపై సమీక్ష

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : రెవెన్యూ, ఎండోమెంట్స్‌ డిపార్టుమెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజ రామయ్యర్‌ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ ఈవో ఎస్‌.వెంకటరావు, కమిషనరు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం నిర్వహించారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి స్వామి వారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. దర్శనానంతరం స్వామి వారి క్షేత్ర మహత్యమునకు సంబంధించిన పుస్తకం, భక్తుల సౌకర్యార్ధం ఆలయ మాడ వీధులలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడి స్క్రీన్లను ఆమె ప్రారంభించారు. అనంతరం దేవస్థాన కార్యాలయంలో ఆలయ అభివృద్ధి కోసం సమీక్ష సమావేశం నిర్వహించారు. డిజిపిఏస్‌ (డిజిటల్‌) సర్వే చేసిన ఆలయ భూములు, వైటిడిఏ భూములు దేవస్థాన పరిసరాలలో గల ప్రభుత్వ భూములు అన్నింటికీ హద్దులు నిర్ధారిస్తూ దేవాదాయ చట్టం అమెండ్‌మెంట్‌ సంబందించి వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా తిలకించారు. అనంతరం ఇటీవలే ఏర్పాటు చేసిన గరుడ ట్రస్టుకు సంబందించి భక్తులను భాగస్వాములుగా ప్రాథమిక విధివిధానాలను ఏర్పాటు చేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన ఇ-ఆఫీసును పరిశీలించారు. దేవస్థాన పరిసర ప్రాంతాల్లో గోశాల, పుష్కరిణి, వేద పాఠశాల నిర్మాణ పనులు పరిశీలించారు. ఈవో వెంకటరావు, జిల్లా కలెక్టర్‌ ఎం.హనుమంతరావు, వీసీ అండ్‌ సీఈవో జి.కిషన్‌రావు, వైటిడిఏ అధికారులతో ఆలయ అభివృద్ధి పనులు, టెంపుల్‌ సిటీ జియోగ్రాఫికల్‌ ఏరియా ఫైనలైజేషన్‌కు సంబందించి సమీక్షించారు. అనువంశిక ధర్మకర్త భాసకరాయణి నరసింహమూర్తి, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వీరారెడ్డి, దేవాదాయ శాఖ ఉప కమిషనర్లు కె.వినోద్‌ రెడ్డి. కృష్ణప్రసాద్‌, వెంకటేష్‌, జిల్లా పంచాయతీ అధికారి, రెవెన్యూ డివిజినల్‌ అధికారి, భువనగిరి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, సర్వే లాండ్స్‌ యాదగిరిగుగుట్ట, భువనగిరి మున్సిపల్‌ కమిషనర్లు, దేవస్థాన డిప్యూటి ఈవో, ఇతర జిల్లా ఉన్నతాదికారులు పాల్గొన్నారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *