– స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారి జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకుని భక్తులు వేకువజామునే గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కవచమూర్తుల అష్టోత్తర శతకలశాభిషేకం పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయంలో 108 కలశాలకు పూజలు జరిపించారు పంచసూక్తపటనంతో హోమం నిర్వహించి ఉత్సవ మూర్తులను, ప్రతిష్ట అలంకారమూర్తులను అభిషేకించారు. తులసీ దళాలతో సహస్రనామార్చన నిర్వహించారు. ఈ ఆలయానికి అనుబంధమైన పాత గుట్ట ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





