శక్తి స్వరూపిణి అమ్మవారి పూజ

– పాల్గొన్న గవర్నర్ దంపతులు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర, మార్చి 26: శ్రీరామ నవమిని పురస్కరించుకుని చైత్ర నవరాత్రి మహాష్టమి వేడుకలు దివ్యశక్తి ఆరాధనకు ప్రతీక అని రాష్ట్ర గవర్నర్  శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. గురువారం లోక్ భవన్ అధ్వర్యంలో తెలంగాణలో తొలిసారిగా సంస్క తి కమ్యూనిటీ హాల్‌లో చైత్ర నవరాత్రి మహాష్టమి  ఫలహార వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్  శివ ప్రతాప్ శుక్లా తన సతీమణి జానకి శుక్లా తో  కలిసి జ్యోతి  ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. గత 35 సంవత్సరాలుగా తాను ఈ వేడుకల్లో భాగస్వామ్యం అవుతున్నానని, తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తాను, ఈ పవిత్ర వేడుకను తొలిసారిగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లోనూ ఈ వేడుకలు తెలంగాణాలో కొనసాగాలని గవర్నర్ ఆకాంక్షించారు. అమ్మవారి శక్తి స్వరూపమైన దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ, మనలోని అజ్ఞానం, అహంకారం, దుర్గుణాలను తొలగించుకోవాలని సూచించారు. ఫలహార దీక్ష కేవలం ఆహార నియమం మాత్రమే కాకుండా, మనస్సు, శరీరం, ఆత్మలను శుద్ధి చేసే ఆధ్యాత్మిక పవిత్ర సాధనమని గవర్నర్ పేర్కొన్నారు. ఈ ఆచారాలు నియమశీలత, సహనం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.ఈ సందర్భంగా సమాజంలో శాంతి, సోదరభావం పెంపొందించేందుకు అందరూ క షి చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. పరస్పర గౌరవం, సహకారం ద్వారా రాష్టాన్ని అభివ ద్ధి పథంలో నడిపిద్దామని సూచించారు. చివరిగా, మహాష్టమి సందర్భంగా ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. వేడుకలలో కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి, ఎంపీ  రఘునందన్ రావు,మాజీ గవర్నర్ దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  రామచంద్రరావు, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్,అదనపు డీజీపీ మహేష్ భగవత్,జిల్లా కలెక్టర్ హరి చందన, రాజ్ భవన్ సీనియర్ అధికారులు, ఇతర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు

సిఎం రేవంత్ శ్రీరామనవమి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి సీతారాముల ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించారు. భద్రాద్రి రామాలయాన్ని సంపూర్ణంగా అభివ ద్ధి చేసేందుకు ప్రజా ప్రభుత్వం మాస్టర్ ఎª`లాన్ సిద్ధం చేసిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.351 కోట్లు కేటాయించామన్నారు. భద్రాద్రి శ్రీరాముని క్షేత్ర ప్రాధాన్యం దేశమంతటికీ చాటేలా ఘనంగా నవమి వేడుకలు జరుపుకోవాలన్నారు. భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *