నిర్దేశిత‌ సమయానికి పనులు పూర్తి : మంత్రి పొంగులేటి 

– మేడారంలో మంత్రుల పర్యటన
– పనులను పర్యవేక్షించిన అమాత్యులు
– భక్తులకు ఇబ్బంది లేకుండా సకాలంలో పూర్తికి చర్యలు

ములుగు, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: ‌మేడారంలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పదికోట్ల మంది భక్తులు వచ్చినా దర్శనానికి ఇబ్బందులు లేకుండా పనులు చేస్తున్నామని తెలిపారు. మేడారంలో మంత్రులు పర్యటించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌లు ‌బుధవారం మేడారం చేరుకుని అక్కడి పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఆపై వనదేవతలను దర్శించుకున్నారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. ఆదివాసీల మనోభావాలను గౌరవిస్తూ పనులు చేస్తున్నామని, ఆదివాసీ పూజారుల ఆలోచనతోనే పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. గతంలో మేడారంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, సీఎం రేవంత్‌ ‌రెడ్డి వచ్చాక మేడారం అభివృద్ధి జరుగుతోందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని.. దీనిపై కేంద్రమంత్రులు కిషన్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌ ‌కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఒప్పించాలని మంత్రి సీతక్క కోరారు. మేడారం మహాజాతర నాటికి పనులు పూర్తవుతాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ అన్నారు. మేడారం అంటే తమ బంధం, భక్తి, భావోద్వేగం, బాధ్యత అని మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు. మేడారంలో పది తరాలకు సరిపడ అభివృద్ధి చేస్తామన్నారు. గతంలో వేసిన షెడ్లను తొలగించి పక్కకు పెట్టామన్నారు. మేడారంలో ఎలాంటి ప్రతిమలు లేకపోయినా కోట్లాదిమంది భక్తులు తరలివస్తున్నారన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *