కేర్ హాస్పిట‌ల్స్ లో వైద్యుల‌కు బ్రీతింగ్ వ‌ర్క్ షాప్‌

– వైద్యుల‌కు మ‌రిన్ని నైపుణ్యాలు క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 18:  అత్యవసర,  క్లిష్టమైన వైద్య సంరక్షణలో కీలక నైపుణ్యాలను వైద్యులకు అందించి, వారిని మరింత శక్తివంతం చేయాలనే లక్ష్యంతో కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా సహకారంతో బేసిక్స్ టు అడ్వాన్సెస్ ఇన్ ఎయిర్‌వే అండ్‌ బ్రీతింగ్ వర్క్‌షాప్’ను నిర్వహించింది. ప్రాణాలను కాపాడే ఈ కార్యక్రమం ద్వారా వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఎయిర్‌వే నిర్వహణ, శ్వాసకోశ మద్దతు వంటి అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన కీలక నైపుణ్యాలను అభ్యసించారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో రోగుల వాయుమార్గం, శ్వాస నిర్వహణలో తాజా పద్ధతులు, ప్రోటోకాల్‌లపై అవగాహన కల్పించడమే ఈ వర్క్‌షాప్ లక్ష్యం. అత్యవసర, క్రిటికల్ కేర్ వైద్యులు, అనస్థీషియా నిపుణులు, ఇంటెన్సివిస్టులు, రెసిడెంట్లకు ఉపయోగపడేలా రూపొందించబడింది. ప్రత్యక్ష ప్రదర్శనలు, అనుకరణ ఆధారిత శిక్షణ, నిపుణుల మార్గదర్శక చర్చల ద్వారా ప్రాథమిక నుంచి అధునాతనస్థాయి వరకు జ్ఞానాన్ని అందించారు. రాష్ట్ర వైద్య మండలి రెండు క్రెడిట్ అవర్స్‌తో గుర్తింపు ఇచ్చిన ఈ కార్యక్రమంలో ఎయిర్‌వే అంచనా, ప్రణాళిక, ప్రాథమిక, అధునాతన ఎయిర్‌వే పరికరాల వినియోగం, బ్యాగ్-మాస్క్ వెంటిలేషన్, ఎండోట్రాషియల్ ఇంట్యూబేషన్, కష్టమైన ఎయిర్‌వే పరిస్థితులలో నిర్వహణ పద్ధతులు, ఆక్సిజన్ థెరపీ, వెంటిలేషన్ విధానాలు, సమస్యల పరిష్కారం వంటి అంశాలు ఉంటాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ విశాల్ మహేశ్వరి మాట్లాడుతూ ఇలాంటి నైపుణ్య ఆధారిత శిక్షణా కార్యక్రమాలు ఈ సమయంలో చాలా అవసరం. ప్రతి సెకను విలువైనప్పుడు శిక్షణ పొందిన చేతులు, స్పష్టమైన విధానాలు మాత్రమే ప్రాణాలను కాపాడగలవు. దేశంలో ఆరోగ్య సిబ్బందిలో క్లినికల్ విశ్వాసాన్ని పెంపొందించడంలో కేర్ హాస్పిటల్స్ తీసుకున్న ఈ అడుగు ఎంతో ప్రశంసనీయం అని తెలిపారు. కేర్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం జోనల్ హెచ్‌ఓడి, అసోసియేట్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ కిరణ్ కుమార్ వర్మ మాట్లాడుతూ ఎఫెక్టివ్ ఎయిర్‌వే, బ్రీతింగ్ ఇంటర్వెన్షన్ అనేవి ప్రాణాలను రక్షించడంలో తొలి, కీలకమైన దశలు. ఈ వర్క్‌షాప్ వైద్యులకు సైద్ధాంతిక జ్ఞానం మాత్రమే కాకుండా, ఆ జ్ఞానాన్ని నిజమైన పరిస్థితుల్లో ఎలా ఉపయోగించాలో నేర్పుతుంది. అత్యవసర సమయాల్లో క‌చ్చితంగా, వేగంగా స్పందించడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కేర్ హాస్పిటల్స్ జోనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజు నాయర్ మా ట్లాడుతూ తాము కేవలం క్లినికల్ ఎక్సలెన్స్‌కే ప్రాధాన్యత ఇవ్వం.. ప్రతి వైద్యుడు సమయానికి సరైన నిర్ణయంతో సేవలు అందించగలిగే విధంగా వ్యవస్థలను నిర్మించడమే లక్ష్యం. ఎయిర్‌వే అండ్‌ బ్రీతింగ్ లాంటి వర్క్‌షాప్‌లు ఒక మంచి మార్పుకు దారితీస్తాయి, ఇవి సంస్థలను మాత్రమే కాదు, మొత్తం ఆరోగ్య రంగాన్ని బలపరుస్తాయిని అన్నారు. ఈ వర్క్‌షాప్‌ క్లినికల్‌ ఎక్సలెన్స్‌, వైద్య విద్య, అత్యవసర పరిస్థితులపై సంసిద్ధతను పెంచడంలో కేర్ హాస్పిటల్స్‌ నాయకత్వాన్ని మరింత బలపరుస్తుంది. సిద్ధాంతం, ప్రాక్టీస్‌ మధ్య ఉన్న తేడాను తగ్గిస్తూ ఈ కార్యక్రమం ఆరోగ్య సేవలందించే నిపుణుల కోసం సహకార నైపుణ్యాలను పెంపొందించే ఒక మంచి వేదికగా నిలుస్తుంద‌న‌డంలో ఎంత‌మాత్రం సందేహం లేదు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *