తండ్రి ఆశయ సాధనకు అహర్నిశలు కృషి

– మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ముత్తారం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా వారి స్మారక కార్య క్రమాలు ఘనంగా నిర్వహించారు. ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రామంలో ముందు గా శ్రీపాద రావు విగ్రహానికి మంత్రి శ్రీధర్ బా బు, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, చింతకుంట విజయ రమణారావు,మాజీ ఎమ్మె ల్యేలు ఆరెపల్లి మోహన్, కటకాం మృత్యుం జయం, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం మండల కాంగ్రెస్ అధ్యక్షు లు దొడ్డ బాలాజీ పలువురు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మండల కేం ద్రంలోని ప్రైవేటు గార్డెన్లో శ్రీపాద ట్రస్ట్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో పుష్పగిరి హాస్పట ల్ వారి సౌజన్యంతో ఉచితంగా కంటి పరీక్ష లు,ఉచిత కంటి శస్త్ర చికిత్సలు, ఉచిత కళ ద్దాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ శ్రీపాదరావు చేసిన ప్రజాసేవను గుర్తు చేసుకుంటూ ఆయన ప్రజ ల పట్ల చూపిన నిబద్ధత సేవా భావం ఆద ర్శప్రాయం అని తండ్రి ఆశయ సాధన కొరకు కొడుకులు అయిన మంత్రి శ్రీధర్ బాబు, శ్రీనుబాబులు అహర్నిశలు ప్రజల కోసం ప్రాంత అభివృద్ధి కొరకు పని చేస్తారని అన్నారు. అనం తరం మంత్ర శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు చేయాలని చూపుతున్న ప్రేమ కు ప్రతిరూపంగానే మీ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, పేద ప్రజలకు తోచిన సాయం చేయడం లో ఎంతో ఆనందంగా ఉంటుందని ఉన్నారు. ఎవరెన్ని అక్కరకు రాని మాటలు మాట్లాడిన తాను పట్టించుకోనని ప్రాంత అభి వృద్ధి పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడడమే తమ లక్ష్యమని అన్నారు. చివరకు గత ఎన్నిక లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పక్కగా అమలు చేసిన తర్వాతనే వచ్చే ఎన్నికలకు వెళ్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభవ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. ముత్తారంలో నిరుపేద కుటుంబాల కు ఇద్దరికీ ఇందిరమ్మ ఇళ్ల కొరకు ముగ్గు పోశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమం కొరకు పథకాలను రూపొందించి పక్కాగా అమలు చేయడం జరుగుతుం దన్నారు ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలును ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. మండలంలో కంటి వైద్య శిబిరం విజయవంతం చేయడంలో కృషి చేసిన మంత్రి వ్యక్తిగత సహాయకుడు మహేందర్ యాదవ్ ను ఈ సందర్భంగా పలువురు అభి నందించారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య, మాజీ జడ్పిటిసి నాగినేని జగన్మోహన్రావు, బ్లాక్ కాం గ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వినీత్, పలువురు సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *