దగా పడుతున్న శ్రామికులు

ఔట్ సోర్సింగ్ సేవకు న్యాయం ఎక్కడ?

– ప్రభుత్వ వ్యవస్థలో ఐదు లక్షల మంది శ్రమ దోపిడీ
– కొత్తవారికి రక్షణ, పాతవారికి నిర్లక్ష్యం
– అధికారులు, ఏజెన్సీల విషవలయంలో పడి విలవిల
– ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన

                                                                               (వెంకగారి భూమయ్య, ప్రజాతంత్ర బ్యూరో)

రాష్ట్రం ఏర్పడి దశాబ్దానికి పైగా గడి చినా, స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు దాటినా, ప్రభుత్వ వ్యవస్థల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలు మా త్రం కన్నీటి గాథలుగానే మిగిలిపోయాయి. ప్రభుత్వ వ్యవస్థల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలు ఇంకనూ బాగుపడడం లేదు. కోటి ఆశలతో సాధించుకున్న తెలంగాణాలో అలనాటి బానిసత్వం రూపాంతరం చెంది నేటి ‘నల్ల దొరల’ చేతుల్లో అధికారులు, ఏజెన్సీలు, ప్రభుత్వాల ద్వంద్వ వైఖరి అనే మూడు విషవలయాల్లో చిక్కుకుని ఈ లక్షలాది మంది బతుకులు ఆగమవుతున్నాయి.

పనికి తగిన ప్రతిఫలం లేదు

రాష్ట్రంలోని సుమారు 30 శాఖల్లో ఐదు లక్షలకు పైగా ఔట్ సోర్సింగ్గ్ ఉద్యోగులు  ప్రభుత్వానికి వెన్నెముకలా నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారు. వీరు చేసే పని రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఉన్నా వారికి కనీస వేతనం కూడా లభించడంలేదు.

ఉద్యోగ  భద్రత ఎంతమాత్రం లేదు

వేతనాలు తరచూ ఆలస్యం అవుతుంటాయి, ముఖ్యంగా వారి భవిష్యత్తుకు ఎలాంటి హామీ లేదు. దశాబ్దాలుగా సేవలో ఉన్నప్పటికీ కనీస గౌరవం, భద్రత లేమి వారిని తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తోంది.

సొంత వ్యవస్థలోనే శ్రమ దోపిడీ

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తూ తెచ్చిన “ప్లాట్ ఫామ్-బేస్డ్ గిగ్ వర్కర్స్ యాక్ట్, 2025 ను స్వాగతిస్తున్నప్పటికీ, అదే సమయంలో 15, 20 సంవత్సరాలుగా ప్రభుత్వ సంస్థల్లోనే సేవలు అందిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల హక్కులను విస్మరించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కొత్త వారికి న్యాయం చేస్తూ దశాబ్దాలుగా సేవలో ఉన్నవారిని విస్మరించడం ప్రభుత్వాల ద్వంద్వ వైఖరికి, ప్రాధాన్యతలలోని లోపానికి నిదర్శనం. ఒకవైపు సంక్షేమ రాష్ట్రం గురించి ప్రకటిస్తూ మరోవైపు తమ సొంత వ్యవస్థలోనే శ్రమదోపిడీని ప్రోత్సహించడం ఏ రకమైన సామాజిక న్యాయం?

ఏజెన్సీల దందా

ప్రభుత్వ వ్యవస్థలోనే అత్యంత హేయమైన ఆర్థిక, శ్రమ దోపిడీ జరుగుతుందనడానికి ఈ ఏజెన్సీ వ్యవస్థే నిద ర్శనం. ఉద్యోగాల పేరుతో ఏజెన్సీలు నిరుద్యో గుల నుంచి లక్షలు వసూలు చేస్తున్నాయనే ఆ రోపణలు లున్నాయి. ప్రభుత్వ ఖజానా నుండి వందల కోట్ల రూపాయలు పొందుతున్న ఏజె న్సీలు, ఆ సొమ్మును ఉద్యోగులకు చేరకుండా మధ్యలోనే దోచుకుంటున్నాయి. ఏజెన్సీలు లాభాల కోసం ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ వంటి సామాజిక భద్రతా హక్కులను కూడా సరిగా చెల్లించడం లేదు.

మనుషులపై ‘పీడన పన్ను’ 18% 

దేశంలో ఎక్కడా లేని విధంగా, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల శ్రమపై 18% జీఎస్టీ విధించడం, వారిని మనుషులుగా కాకుండా కేవలం వస్తు వులుగా’ పరిగణించడం రాజ్యాంగం కల్పించి న ఆత్మగౌరవ హక్కుకు విరుద్ధం. ఈ ‘పీడన పన్ను’ భారం చివరికి ఉద్యోగుల మీదే పడు తోంది. వేతనం ఆలస్యమైనా, నిలిచిపోయినా నిస్సహాయతలో బతుకుతున్నారు.

భద్రత లేని బతుకులు

సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే అనేక సంవత్సరాలు ప్రభుత్వ సేవలో ఉన్న ఉద్యోగి అకాల మరణం చెందితే, వారి కుటుంబాలకు కనీసం ఒక్క రూపాయి ఆర్థిక సహాయం కూడా అందడం లేదు. వందల కోట్ల లాభాలు పొందు తున్న ఏజెన్సీలు గానీ, ప్రభుత్వం గానీ చనిపో యిన ఉద్యోగి కుటుంబాన్ని పట్టించుకోకపో వడంతో, ఆ కుటుంబాలు రోడ్డున పడి ఆకలి కేకలు వేయాల్సిన దుస్థితి నెలకొంది. రిటైర్మెం ట్ వయసు చేరుకున్నవారికి కూడా పెన్షన్, భద్రత లేని భవిష్యత్తు భయం వెంటాడుతోంది.

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తక్షణ డిమాండ్లు

ఆత్మగౌరవంతో బతికేందుకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వం ముందు ఉంచుతున్న ప్రధాన డిమాండ్లు ఇలా ఉన్నాయి. మధ్యవర్తిత్వ ఏజెన్సీలను వెంటనే రద్దు చేయాలి. జీతాల చెల్లింపు, ఉద్యోగ నిర్వహణ కోసం కార్పొరేషన్ వ్యవస్థ ద్వారా చట్టబద్ధత కల్పించాలి. 15 ఏళ్ల కు పైగా పనిచేసిన ఉద్యోగులకు రీషనలైజేషన్ పై స్పష్టమైన హామీ ఇవ్వాలి. కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాచ్యుటీ వంటి హక్కులను చట్టబద్ధంగా అమలు చేయాలి. వేతనాలు సమ యానికి అందేలా కేంద్రీకృత చెల్లింపు విధా నాన్ని ప్రవేశపెట్టాలి. ఉద్యోగ భద్రత లేకుండా ప్రజా సేవలు నడవవు. తెచ్చుకున్న తెలంగాణా లో బతుకులు ఆగమైపోతున్నాయని నడిరోడ్డు మీద ఆకలి కేకలు వేస్తున్న ఈ ఉద్యోగుల సమ స్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. ఏజెన్సీ విధానాలను పూర్తిస్థాయిలో రద్దుచేసి, కార్పొరేషన్ ద్వారా చట్టబద్ధత తీసుకొచ్చి, వారి కుటుంబాలకు ఆత్మగౌరవం నింపాల్సిన చారి త్రక బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *