– త్రిస్సూర్ జిల్లాల్లో మంత్రి శ్రీధర్‌బాబు సుడిగాలి ప్రచారం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: శాసనసభ ఎన్నికలు జరుగుతున్న కేరళంలోని త్రిస్సూర్ జిల్లాలో సోమవారం తెలంగాణ ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. త్రిస్సూర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జోసెఫ్ తాజెట్‌తో కలిసి ఆయన రెండు రోజులుగా ఒల్లూర్, నట్టిక, కైపమండలం, పుదుక్కాడ్, చలకుడి, కోడుంగల్లూర్, మనలూర్ తదితర అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. త్రిస్సూర్ జిల్లాలో 13 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ రెండు స్థానాలను మాత్రమే దక్కించుకుంది. ఈసారి అధికార ఎల్డీఎఫ్ తీవ్రస్థాయిలో ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో త్రిస్సూర్ జిల్లాలో కాంగ్రెస్ మెజారిటీ సీట్లను దక్కించుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పగలంతా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటున్న శ్రీధర్‌బాబు రాత్రి వేళ కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ గెలుపునకు అందరూ ఐకమత్యంగా కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. సోమవారం మహారాష్ట్రలోని పశ్చిమ నాగపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే, నాగపూర్ డీసీసీ అధ్యక్షుడైన వికాస్ ఠాక్రే శ్రీధర్‌బాబు ను మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికల ప్రచారం తీరుతెన్నులపై చర్చించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





