– నూతన సర్పంచులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 22ః ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొంది సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన దిశగా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఒక ప్రకటనలో హితవు పలికారు. గ్రామాలే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని పేర్కొన్న మంత్రి సర్పంచులు, వార్డు సభ్యులు సమష్టిగా పనిచేస్తేనే పల్లె ప్రగతి సాధ్యమవుతుందని తపేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపే నాయకత్వం అందించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తుందని, ప్రజాప్రతినిధులు ధైర్యంగా ముందుకు సాగాలని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





