– ఆ బిల్లుపై విమర్శలు తగవు
– డి లిమిటేషన్‌తో ఎవరికీ అన్యాయం జరగదు
– సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఎంపీ అరుణ స్పందన
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌ను దేశ ప్రజలు స్వాగతిస్తున్నారని ఎన్డీయే కూటమి పార్టీల నేతలే చెబుతున్నారని బీజేపీ¾ ఎంపీ డీకే అరుణ అన్నారు. మహిళా రిజర్వేషన్ అంశానికి ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇస్తూనే డీలిమిటేషన్‌పై విమర్శలు చేస్తున్నాయన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విమర్శలు చేయడం సరికాదని అన్నారు. దక్షిణాది, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అరుణ తీవ్రంగా స్పందించారు. మహిళా రిజర్వేషన్లు, పార్లమెంటు, అసెంబ్లీలలో మహిళల ప్రాతినిథ్యం పెంచడానికి సాయపడుతుందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల అంశంపై రాజకీయం చేయవద్దని ప్రతిపక్ష పార్టీలకు సూచించారు. ఈ రిజర్వేషన్ల ద్వారా చట్ట సభల్లో మహిళలకు సమానావకాశాలు లభిస్తాయని, వారి ప్రాతినిధ్యం పెరుగుతుందని, పార్టీలÅ£తీతంగా ప్రతి ఒక్కరి మద్దతు అవసరమని ఆమె అన్నారు. అలానే డీలిమిటేషన్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదన్నారు. తాము కూడా దక్షిణాదిలోనే ఉన్నామని, అన్యాయం జరగనివ్వబోమని చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ జరుగుతుందని, ఈ పక్రియకు రెండేళ్ల సమయం పడుతుందన్నారు. డీలిమిటేషన్, మహిళల రిజర్వేషన్లను రాజకీయం చేయొద్దని కాంగ్రెస్‌ను కోరుతున్నానన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని రేవంత్‌కే వదిలేస్తున్నానని కిషన్‌రెడ్డి అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





