– మహిళా కమిషనన పిలుపు
– అన్నోజిగూడలో కూతుళ్ల భద్రత, కూతుళ్ల విద్యపై అవగాహన
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : దేవీ నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాలు మహిళా శక్తి, ఆడబిడ్డల ప్రాధాన్యతకు ప్రతీకలని, ఈ సందర్భంలో సమాజం మొత్తం కూతుళ్ల భద్రత, విద్యకు కట్టుబడాలని మహిళా కమిషన్ పిలుపునిచ్చింది. దేవీ నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాల సందర్బంగా మహిళా కమిషన్ చైరనపర్సన్ నేరెళ్ళ శారద ఆదేశాల మేరకు కమిషన్ ఆధ్వర్యంలో కూతుళ్ల భద్రత- కూతుళ్ల విద్య అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని ఘటకేసర్ మండలం అన్నోజిగూడలో ఘనంగా నిర్వహించింది. ముఖ్య అతిథిగా కమిషన్ మెంబర్ ఈశ్వరీబాయి మాట్లాడుతూ సమాజంలో బాలికల రక్షణ, బాలికలకు నాణ్యమైన విద్య అందించడంపై అవగాహన కల్పించారు. బాలికలపై వేధింపులను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహిళా కమిషన్ సెక్రటరీ పద్మజా రమణ మాట్లాడుతూ కూతుళ్లను భద్రంగా, సమాన హక్కులతో చదివించడం ప్రతి కుటుంబం కర్తవ్యమని, విద్య ద్వారానే బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలరని, చట్టపరమైన రక్షణలు, 181, 100 హెల్ప్‌లైన్ సదుపాయాల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని తెలియజేశారు. షీ టీమ్ అధికారులు మహిళలు, బాలికలకు సైబర్ సేఫ్టీ, సామాజిక మాధ్యమాల వినియోగంపై అవగాహన కలిగించారు. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ మహిళలు, బాలికలు ఎలాంటి పోషకాహరం తీసుకోవాలి, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపైన అవగాహన కలిగించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆడాల్సెంట్ గర్ల్స్, మహిళలు మరియు అల్వాల్ సీడీపీవో స్వాతి, ఐసీడీఎస్ సూపరనవైజర్లు, మహిళా కమిషన్ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





