శబరిమలలో మహిళలకు ప్రవేశం – కేరళ స‌ర్కార్‌ యూ టర్న్ ‌

– 50 ఏళ్ల లోపు వారికి అనుమతి కుదరదు
– ‘సుప్రీమ్‌’‌కు నివేదన

తిరువనంతపురం,మార్చి 14: 50 ఏళ్లలోపు మహిళల్ని శబరిమల ఆలయంలోకి అనుమతించే అంశంపై కేరళలోని ఎల్డీఎఫ్‌ ‌ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల్ని ఆలయంలోకి అనుమతించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు కేరళం సీఎం పినరయి విజయన్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన క్యాబినెట్‌ ‌మీటింగ్‌లో దీనిపై ఆమోదం లభించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. భక్తుల మనోభావాలు, ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాల్ని దృష్టిలో ఉంచుకుని, వాటిని కాపాడాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే, త్వరలోనే కేరళం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, రాజకీయ కోణంలోనే ఎల్డీఎఫ్‌ (‌లెప్ట్ ‌డెమొక్రటిక్‌ ‌ఫ్రంట్‌) ఈ ‌నిర్ణయం తీసుకుందని రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. శబరిమల ఆలయంలోకి వయసుతో సంబంధం లేకుండా మహిళలకు ప్రవేశం కల్పించాలని కొన్నేళ్లక్రితం ఆందోళనలు చెలరేగాయి. అయితే, ఈ నిర్ణయాన్ని శబరిమల ఆలయ యాజమాన్య బాధ్యతలు చూసే ట్రావెన్‌కోర్‌ ‌దేవస్థాన బోర్డు వ్యతిరేకించింది. ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయం ప్రకారం.. మహిళలకు మెనుస్టువ్రల్‌ ‌సైకిల్‌ ఉం‌డే పదేళ్ల వయసు నుంచి 50 ఏళ్ల వయసు మహిళల్ని ఆలయంలోకి అనుమతించబోమని తెలిపింది. ఈ నిర్ణయాన్ని 2018లో ప్రభుత్వం వ్యతిరేకించింది. అన్ని వయసుల వారికి ఆలయ ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం అందరు మహిళలు ఆలయంలోకి వెళ్లొచ్చని తెలిపింది.
అయితే, ఇప్పుడు ఈ నిర్ణయాన్ని ఎల్డీఎఫ్‌ ‌ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. పాత సంప్రదాయాల ప్రకారమే 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశంపై నిషేధం విధిస్తామని కోర్టుకు తెలిపింది. ఈ అంశంలో ప్రభుత్వ నిర్ణయం ఏంటో చెప్పేందుకు తుది గడువు కావడంతో తాజా నిర్ణయాన్ని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ అంశంపై వచ్చే నెల 7 నుంచి సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి. మరోవైపు ప్రభుత్వం యూటర్న్ ‌తీసుకోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇంతకాలం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడిన వారిపై నమోదైన కేసుల సంగతేంటని ప్రశ్నిస్తున్నాయి. ఈ నిరసనలకు సంబంధించి నమోదైన కేసుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని బీజేపీ డిమాండ్‌ ‌చేస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *