పశు సంవర్థక,మత్స్య, పాడి పరిశ్రమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
మహబూబ్‌నగర్ ఫస్ట్ నైపుణ్య అభివృద్ధి కేంద్రం ప్రారంభం
మహబూబ్‌నగర్ ప్రజాతంత్ర, జూన్ 17 : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పశుసంవర్ధక,మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మహబూబ్ నగర్ ఫస్ట్ నైపుణ్య అభివృద్ది కేంద్రం, సెట్విన్ ద్వారా వివిధ స్వల్పకాలిక కోర్సుల్లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ ల ప్రదాన కార్యక్రమాన్ని మంత్రి జ్యోతి మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ ఫస్ట్ కార్యక్రమం కింద సెట్విన్ ద్వారా మహిళలకు స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి ఆలోచనతో స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. యువజన శాఖ పరిధిలో ఉన్న సెట్విన్ ద్వారా మహబూబ్ నగర్ లో మహిళలకు శిక్షణ కార్యక్రమాలను పైలెట్ గా తీసుకొని ఉమ్మడి పాలమూరు జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలిపారు. పాలమూరు మహిళలు రాష్ట్రం లో ఆదర్శంగా నిలిచేలా తన శాఖ ద్వారా బాధ్యత తీసుకుంటానని తెలిపారు. నారాయణ పేట జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా నిర్వహించే ముఖ్యమంత్రి పెట్రోల్ బంక్ ను ప్రారంభించామని అన్నారు. ప్రతి జిల్లాలో పెట్రోల్ బంక్ లు మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు యెన్నం శ్రీనివాసరెడ్డి తన నియోజక వర్గంలో పదో తరగతి పిల్లలకు ప్రత్యేకంగా రూపొందించిన 3డి యానిమేటెడ్ పుస్తకాలు పంపిణీ మార్గదర్శకంగా తీసుకుని మక్తల్ నియోజకవర్గంలో 3718 విద్యార్థులకు అందజేసినట్లు తెలిపారు. 62 శాతం ఉన్న ఉత్తీర్ణత శాతం 100 శాతం పెరగడం గమనార్హం అన్నారు.మహబూబ్ నగర్ పట్టణం లో చేపట్టిన 3 డి యానిమేషన్ మెటీరియల్ వచ్చే సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టడానికి కృషి చేస్తామని సి.ఎం.తెలియ చేశారని అన్నారు. మక్తల్ నియోజకవర్గం అమరచింతలో 200మంది మహిళలు డ్రెస్ మెటీరియల్ డిజైన్,తయారీఆర్డర్ చేసి ప్రతి నెల రూ.12 వేల నుండి రూ.14 వేలు సంపాదిస్తున్నట్లు, సెట్వీన్ బాధ్యత తీసుకోవాలని అన్నారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే ఎన్‌ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహిళల సంక్షేమ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో 5 వేల మందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 16 నెలలలో 1000మంది మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. పయనీర్ కార్యక్రమం ద్వారా ఎంసెట్ పరీక్షకు 200 మందికి శిక్షణనిస్తే 114 మంది విద్యార్థులు ఫ్రీ సీట్లు సంపాదించినట్లు తెలిపారు. మహిళలు ఉత్పత్తి చేసే వస్తువులకు మయూరి బ్రాండ్ ద్వారా మార్కెటింగ్ చేయనున్నట్లు తెలిపారు. మయూరి బ్రాండ్ ద్వారా 700 సీతాఫలాల బాక్స్ లు ఐటీ కంపెనీలకు ప్రయోగాత్మకంగా మార్కెటింగ్ చేసినట్లు తెలిపారు. కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ మహబూబ్ నగర్ శాసన సభ్యులు నవరత్నాలు కార్యక్రమం ద్వారా వివిధ కార్యక్రమాలు చేపట్టినట్లు, విద్యకు ప్రాధాన్యతనిస్తూ మహబూబ్ నగర్ ఫస్ట్ ద్వారా మహిళలకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐఐఐటి ని ప్రభుత్వం మంజూరు చేసినట్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర మైనార్టీ ఆర్థిక సంస్థ చైర్మన్ ఒబే దుల్లా కొత్వాల్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే నవరత్నాలు కార్యక్రమం ద్వారా 90 రోజులు స్వల్పకాలిక కోర్సులలో శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. ఎంఎల్‌ఏ తన స్వంత నిధులతో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారన్నారు. సెట్విన్ ఎండి కె వేణుగోపాలరావు మాట్లాడుతూ గ్రామాలకు శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి ఎంతో ప్రోత్సహించారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 39 సెంటర్లు నిర్వహిస్తున్నట్లు, అందులో 50 కోర్సులలో, మూడు నెలల నుంచి సంవత్సరం పాటు శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం శిక్షణ పొందిన మొదటి,రెండవ బ్యాచ్ మహిళలకు మంత్రి వాకిటి శ్రీహరి సర్టిఫికెట్లు అందచేశారు. కార్యక్రమంలో గిరిధర్ రెడ్డి, మల్లు నరసింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్,మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్,జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.పి.వెంకటేష్,కాంగ్రెస్ నాయకులు సురేందర్,సిరాజ్ ఖాద్రి,ఎల్.డి.ఎం.భాస్కర్,క్రీడలు,యువజన శాఖ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




