– వారి ఆర్థిక స్వావలంబన కోసం కృషి
– ఉచిత బస్సుతో దక్కిన భరోసా
– ప్రతి మహిళను ఎస్‌హెచ్‌జీ సభ్యురాలిగా చేర్చాలన్నదే లక్ష్యం
– ఇందిరమ్మ క్యాంటీన్ల కోసం వడ్డీ లేని రుణాలు
– అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సీతక్క సమాధానం
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి5:మహిళా సాధికారతకు సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్నామన్నారు. మహిళా సాధికారత, సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. సభ మొదలైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటుపై సభ్యులు ప్రశ్న లేవనెత్తగా మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. ప్రతి మహిళ ఎస్‌హెచ్‌జీ సభ్యురాలుగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని వెల్లడించారు. 15 సంవత్సరాలు దాటిన బాలికల నుంచి పండు ముదుసలి వరకు మహిళా సంఘం సభ్యులుగా చేర్చుతున్నామని తెలిపారు. కిశోర బాలికలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 250 ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. క్యాంటీన్ల నిర్వహణ, పెట్టుబడి కోసం స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. సంఘాల సభ్యులకు 10 రోజులపాటు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చామన్నారు. పట్టణ ప్రాంతాల్లో 130 క్యాంటీన్లు చేసినట్లు వివరించారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పమని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేశామని మంత్రి సీతక్క గుర్తు చేశారు. ఇది మహిళలకు భద్రతతోపాటు ఆర్థికంగా ఉపశమనాన్ని కలిగించే కీలక నిర్ణయమని పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. మహిళలు స్వయం ఉపాధి సాధించేందుకు అవసరమైన అవకాశాలు, వనరులు కల్పిస్తూ వారి ఆర్థిక బలాన్ని పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు. 15 సంవత్సరాలు దాటిన బాలికల నుంచి వృద్ధ మహిళల వరకు అందరినీ మహిళా సంఘాల్లో సభ్యులుగా చేర్చుతున్నామని తెలిపారు. మహిళలను ఒక వ్యవస్థలోకి తీసుకువచ్చి అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యమన్నారు. అదేవిధంగా కిశోర బాలికలు, వృద్ధులు, దివ్యాంగ మహిళల కోసం ప్రత్యేక మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. వీరి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి వారికి ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అయితే సోమవారం కూడా శాసనసభ, శాసనమండలి సమావేశాలకు హాజరుకావొద్దని బీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకుంది. సభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వటంలేదని, అందుకు నిరసనగా బీఆర్‌ఎస్ అసెంబ్లీని బహిష్కరించిన విషయం తెలిసిందే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.