మహిళలు వ్యాపార రంగంలో రాణించాలి

– కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: దేశ జీడీపీ పెరగాలంటే మహిళలు వ్యాపార రంగంలో ముందుకొచ్చి రాణించాలని కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్‌ వివేక్‌ వెంకటస్వామి పిలుపునిచ్చారు. హైటెక్‌ సిటీ టెక్‌ మహీంద్రాలో శుక్రవారం జరిగిన సీఐఐ ఇండియన్‌ ఉమెన్‌ అప్‌లిఫ్ట్‌ -వాయిస్‌ ఫర్‌ ఛేంజ్‌ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం కోసం సీఎల్‌ఎల్‌ ఎంతో కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మంచి అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. వాయిస్‌ ఫర్‌ ఛేంజ్‌ మహిళల్లో మల్టీ టాస్కింగ్‌ నైపుణ్యం, ధైర్యం ఎక్కువగా ఉంటుందన్నారు. చిన్న మొత్తంతోనే వ్యాపారం మొదలుపెట్టాలని, దాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని అభివృద్ధి చేసుకోవాలని యువతకు సలహా ఇచ్చారు. తప్పు నిర్ణయాలు కూడా జీవితానికి పాఠాలు నేర్పుతాయని ఆయన చెప్పారు. గ్రామీణ మహిళల్లో అపారమైన ప్రతిభ ఉందని, వారికి ప్రోత్సాహం అందిస్తే దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. మహిళల శక్తిని వేదికలపై మాత్రమే కాకుండా ప్రతి ఇంట్లో గుర్తించి అవకాశాలు ఇవ్వడం మనందరి బాధ్యత అని మంత్రి డాక్టర్‌ వివేక్‌ వెంకటస్వామి పిలుపునిచ్చారు. తన కుటుంబంలోని మహిళలు కూడా విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగానే ఉన్నారని ల్ణతెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *