– లెంపలు వేసుకున్న మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్12: ప్రముఖ నటుడు నాగార్జున కుటుంబంపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ వెనక్కి తీసుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నానన్నారు.ఈ మేరకు ఆమె ఓ పోస్టు పెట్టారు. నాగార్జున, ఆయన కుటుంబాన్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. వారిని ఇబ్బందిపెట్టాలని కాని, వారి పరువు-ప్రతిష్టలకు భంగం కలిగించాలన్నది కాని నా ఉద్దేశం కాదు. నాగార్జున కుటుంబంపై నేను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు ఉంటే అందుకు చింతిస్తున్నా. నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా అని పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికే నాగార్జున పరువు నష్టం కేసు వేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





