కెటిఆర్‌కు సిఎం జన్మదిన శుభాకాంక్షలు

– ఎక్స్ ‌వేదికగా రేవంత్‌, ‌కవితల విషెస్‌
-‌ తెలంగాణ భవన్‌లో కేక్‌ ‌కట్‌ ‌చేసిన బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ 

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై24: బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రిసడెంట్‌ ‌కేటీఆర్‌ ‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని కోరారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈమేరకు తెలంగాణ సీఎంవో అధికారిక ‘ఎక్స్’ ‌ఖాతాలో పోస్టు పెట్టారు. అలాగే కేటీఆర్‌కు  ఆయన చెల్లెలు, ఎమ్మెల్సీ కవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘అన్నయ్య.. కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇదిలావుంటే కేటీఆర్‌ ‌జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య కేటీఆర్‌ ‌కేక్‌ ‌కట్‌ ‌చేశారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు తరలివచ్చి ఆయనకు బర్త్‌డే విషెస్‌ ‌తెలిపారు. వారందరికీ కేటీఆర్‌ ‌ధన్యవాదాలు తెలిపారు. తనను అభిమానించే వారి ప్రేమ, ఆశీర్వాదాలతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటానని చెప్పారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రులు మల్లారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *