విపక్షాల ఆందోళన.. వాయిదాల పర్వం షురూ

– తొలి రోజు పార్లమెంట్‌ సమావేశం తీరు 

న్యూదిల్లీ, డిసెంబర్‌ 1: లోక్‌సభ సమావేశాలు వాయిదాల పర్వంతో మొదలయ్యాయి. శీతాకాల సమావేశాల తొలిరోజే వాయిదా పడిరది. ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాగా రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసగించారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు జరుగుతాయంటూ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. కానీ ముందుగా తాము ప్రతిపాదించిన సమస్యలపై చర్చ జరగాలంటూ విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. అన్ని అంశాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామంటూ పశ్నోత్తరాలకు సహకరించాలని విపక్షాలను స్పీకర్‌ కోరారు. కానీ విపక్ష సభ్యులు మాత్రం ముందుగా తాము ప్రతిపాదించిన అంశాలపై చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. దీంతో విపక్ష ఎంపీల తీరుతో స్పీకర్‌ తీవ్ర అసహనం చెందారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 12 గంటలకు సభమళ్లీ ప్రారంభంకాగా విపక్ష సభ్యులు తమ పట్టు వీడలేదు. సర్‌, దిల్లీ బాంబు పేలుళ్లు, దిల్లీలో కాలుష్యం తదితర అంశాలపై చర్చ జరగాల్సిందేనంటూ వారంతా పట్టుబట్ట్టారు. దీంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. ఈ సమయంలో సైతం విపక్ష ఎంపీ తీరు అదేవిధంగా ఉండడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి స్పీకర్‌ వాయిదా వేశారు. మరోవైపు బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బాధ నుంచి ప్రతిపక్షాలు బయటకు రాలేదంటూ ప్రధాని మోదీ చేసి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. పార్లమెంటులో ప్రజా సమస్యలు లేవనెత్తడం డ్రామా కాదని అన్నారు. విమర్శకుల నోరు మూయిస్తున్నారంటూ కేంద్రంపై ఆమె మండిపడ్డారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *