విండోస్‌ 10‌కు కాలం చెల్లినట్లే

– 14 నుంచి సెక్యూరిటీ స‌పోర్ట్ వుండ‌దు
-విండోస్ 11కు అప్‌గ్రేడ్ కావాల‌న్న మైక్రోసాప్ట్ ‌

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్‌ 3:  ‌కంప్యూటర్‌లో విండోస్‌ 10 ‌వాడుతున్న వారికి ఇదో హెచ్చరిక. విండోస్‌ 10 ‌వాడుతున్న వారికి త్వరలో మైక్రోసాప్ట్ ‌సపోర్ట్ ‌నిలిపివేయనుంది.  అక్టోబర్‌ 14 ‌నుంచి ఎలాంటి సెక్యూరిటీ అప్‌డేట్స్ ‌విడుదల చేయబోమని స్పష్టంచేసింది. ఒకవేళ ఇప్పటికీ ఈ ఆపరేటింగ్‌ ‌సిస్టమ్‌నే వాడుతుంటే 11కు అప్‌డేట్‌ అవ్వాల్సిందే. విండోస్‌ 10‌కు సపోర్ట్ ‌నిలిపివేయనున్నట్లు దాదాపు రెండేళ్ల క్రితమే మైక్రోసాప్ట్ ‌ప్రకటించింది. ఆ గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుంది. విండోస్‌ 10‌కు మైక్రోసాప్ట్ ‌సపోర్ట్ ‌నిలిపివేసినా ఎప్పటిలానే ఓఎస్‌ ‌పని చేస్తుందని మెక్రోసాఫ్‌ ‌ప్రతినిధి తెలిపారు. అయితే, సెక్యూరిటీ అప్‌డేట్స్ ‌మాత్రం రావని స్పష్టంచేశారు. దీనివల్ల భద్రతా పరమైన రిస్కులు, మాల్‌వేర్‌, ‌కంపాటబిలిటీ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో బ్రౌజింగ్‌ ‌చేసే వారికి రిస్క్ ‌పొంచి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ అప్‌డేట్స్ ‌మాత్రం 2028 అక్టోబర్‌ ‌వరకు కొనసాగుతాయని మైక్రోసాప్ట్ ‌స్పష్టంచేసింది. ఇది ప్రాథమిక స్థాయిలో భద్రతను మాత్రమే అందించగలదు. అలాగే, ఆపరేటింగ్‌ ‌సిస్టమ్‌ ‌సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో పోలిస్తే యాంటీ వైరస్‌లు ఇచ్చే భద్రత అంతంతమాత్రమేనని పేర్కొంది. ఒకవేళ పూర్తి స్థాయిలో భద్రత కోరుకునేవారైతే ఎక్స్‌టెండెడ్‌ ‌సెక్యూరిటీ అప్‌డేట్స్ ‌పోగ్రామ్‌ను ఎంపిక చేసుకోవచ్చని మైక్రోసాప్ట్ ‌సూచించింది. దీనికి కొంతమొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబర్‌ 15 ‌నుంచి డివైజ్‌ ‌సెట్టింగ్స్‌లో సబ్‌‌స్క్రిప్షన్‌ ఆప్షన్‌ను అందుబాటులో ఉంటుంది. మైక్రోసాప్ట్ ‌విండోస్‌ 10‌ను లక్షలాది మంది వినియోగిస్తున్నారు. వారంతా 11కు అప్‌‌గ్రేడ్‌ అయ్యేలా చూడాలన్నది మైక్రోసాప్ట్ ‌భావిస్తోంది. అందుకే విండోస్‌ 11‌కు అప్‌‌గ్రేడ్‌ అవ్వకపోతే సెక్యూరిటీ అప్‌డేట్స్ ‌నిలిపివేస్తామంటోంది. ఏదైనా కారణం చేత విండోస్‌ 10‌లోనే కొనసాగాల్సి వస్తే.. డబ్బులు పెట్టి ఎక్సెటెండెడ్‌ ‌సెక్యూరిటీ అప్‌డేట్స్ ‌పోగ్రామ్‌ ‌కింద సబ్‌‌స్క్రిప్షన్‌ ‌తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ ఈఎస్‌యూ పోగ్రామ్‌లో కేవలం సెక్యూరిటీ అప్‌డేట్స్ ‌మాత్రమే లభిస్తాయి. కొత్త ఫీచర్లు గానీ, డిజైన్‌ ‌మార్పిడి రిక్వెస్టులు గానీ, నాన్‌ ‌సెక్యూరిటీ రిక్వెస్టులు గానీ అందించదు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *