-జూబ్లీహిల్స్ విజయంపై పీసీసీ చీఫ్
నిజామాబాద్,ప్రజాతంత్ర,నవంబర్14: వొచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలుస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడంతో నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నేరవేరుస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్ పాలనకు నిదర్శమని, ఇది కాంగ్రెస్ కార్యకర్తల విజయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ వరుస విజయాలు సాధిస్తోందన్నారు. వొచ్చే 8 ఏండ్లు తెలంగాణలో మేమే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో వోటింగ్ శాతం తక్కువ నమోదు కావడం అవ్వడం బాధాకరమన్నారు. వోటింగ్ శాతం తగ్గడం మంచి పరిణామం కాదని అన్నారు. యువత వోటు హక్కును వినిగించుకోలేదన్నారు. వోటు హక్కు వినియోగించుకోవాలని.. ప్రజాస్వామ్యంలో వోటు అనేది ఎంతో విలువైనదని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్ గెలుపు కోసం బీజేపీ పని చేసిందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ రెండు పార్టీలు ఒక్కటైనా.. కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం కాంగ్రెస్ కార్యకర్తలకు అంకితం ఇస్తామని ప్రకటించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





