– సమస్యలను నివేదిస్తే తక్షణమే స్పందిస్తాం
– శాంతిభద్రతల్లో తెలంగాణ నెంబర్ వన్
-డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
please subscribe our channel youtube.com/@prajatantra-news
మహిళా పోలీస్ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, మహిళా సిబ్బంది సంక్షేమానికి చేసే సిఫారసులను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు భరోసా ఇచ్చారు. మహిళా పోలీసుల మూడు రోజుల సదస్సు ముగింపు సందర్భంగా పోలీస్ అకాడమీలో ఏర్పాటుచేసిన వీడ్కోలు సమావేశంలో శుక్రవారం పాల్గొని ప్రసంగించారు. నియామక సమయంలో లేని లింగ వివక్ష విధుల్లో చూపడం సరైనది కాదని, మహిళ పోలీసులో మహిళా అనే పదాన్ని తొలగించాలన్న సిఫారసు మంచి ఆలోచనని , రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈ సిఫారసు తో తాను ఏకీభవిస్తున్నానని డిప్యూటీ సీఎం తెలిపారు. నియామక సమయంలో లింగ వివక్ష లేకుండా ఎంపిక చేస్తున్న నేపథ్యంలో విధుల్లో కూడా సమానంగా చూడాలన్న ప్రతిపాదన సరైందేనని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. మహిళా సిబ్బంది వ్యక్తిగత అవసరాలు, యూనిఫామ్ అవసరాలు అన్ని అమలు చేయదగినవే అవేమి గొంతెమ్మ కోరికలు కాదని అన్నారు. మహిళా పోలీస్ సిబ్బంది సమస్యలపై త్వరితగతిన కమిటీ వేసి సైంటిఫిక్ గా రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తే అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





