భూములు కోల్పోతున్న రైతులను ఆదుకుంటాం

– తగిన నష్టపరిహారం అందేలా చూస్తాం
– నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ రవి, ఎమ్మెల్యే కసిరెడ్డిలు హామీ

ఆమనగల్లు, ప్రజాతంత్ర, నవంబర్ 24 : గ్రీన్ ఫీల్డ్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులను ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగ నివ్వకుండా చూస్తామని వారిని అన్ని విధాల ఆదుకుంటామని వారు తమ ముందు ఉంచి న సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారాన్ని కృషి చే స్తామని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిలు స్పష్టం చేశారు. సోమవారం కడ్తాల్ మండ లంలోని ఎక్వా యిపల్లి, ముద్విన్ పరిసరాల రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తహసిల్దార్ జయశ్రీ, ఎంపీడీవో సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో వారు మాట్లా డుతూ గ్రీన్ ఫీల్డ్ రోడ్డులో భూములు కోల్పో తున్న రైతులకు ఆమోదయోగ్యమైన పరిహా రం అందించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామన్నారు. గత సంవ త్సరం కాలంగా నిర్వహిస్తున్న గ్రీన్ ఫీల్డ్ రోడ్డు సర్వే ను రోడ్డు వెళ్లే మార్గాన్ని ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారా యణ రెడ్డితో కలిసి పరిశీలించారు. రైతుల తో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించి రైతుల సందేహాలు నివృత్తి చేశారు. ఈ సం దర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ నాకు ఈ ప్రాంతంతో 30 సంవత్సరాల అను బంధం ఉందని ఈ ప్రాంత ప్రజలకు అన్యా యం జరగనివ్వనని తెలిపారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ అభి వృద్ధికి సహకరిస్తున్న రైతులకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తమపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమి టీ చైర్ పర్సన్ యట గీత నరసింహ, టీపీసీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, తెలంగాణ యువజన కాంగ్రెస్ నాయకులు పాలకుర్ల రవి కాంత్ గౌడ్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, జోగు వీరయ్య, రచ్చ శ్రీరాములు, పాలకుర్ల రాములు, లక్ష్మ య్య, పాలకుర్ల కరుణాకర్ గౌడ్, జంగయ్య గౌడ్, రమేష్ నాయక్, వెంకటేష్, చోటే, అజిజ్, హరీష్, శ్రీను, యాదయ్య, శంకరయ్య, పాండు, సుమన్, మహేందర్, జోగు మహేష్ పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page