– నిజామాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం
– టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్, ప్రజాతంత్ర, జనవరి 21: శ్రీరాముడి పేరు చెప్పకుండా ఎన్నికల్లో నిలబడే దమ్ము బీజేపీకి ఉందా అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని, కాంగ్రెస్ తోనే నిజామాబాద్ అభివృద్ధి సాధ్యమని అన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నిర్వహించిన ప్రెస్ మీట్ లో బుధవారం మాట్లాడుతూ బీజేపీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ నాయకుల తప్పిదాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని.. వాటిపై నోటీసులు ఇస్తే బాధ ఎందుకని అన్నారు.సింగరేణి విషయంలో పస లేని ఆరోపణలు చేస్తున్నారని.. సింగరేణి కాంట్రాక్టులు బీఆర్‌ఎస్ హయాంలో జరిగినవి అని అన్నారు. ఆరోపణలపై ఆధారాలు ఉంటే చర్చకు సిద్ధంగా ఉన్నామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో 20 శాతం ఎక్సెస్ టెండర్లు జరిగాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక అన్ని శాఖలను ప్రక్షాళన చేశామని.. పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన లోపాలను సరిదిద్దుతున్నామని అన్నారు. కేటిఆర్, హరీష్ రావులు బట్ట గాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని.. ఎన్నికల లబ్దికోసం నోటీసులు ఇస్తున్నారనేది సమంజసం కాదని అన్నారు.ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత నేరం..అలాంటి నేరం బీఆర్‌ఎస్ నాయకులు చేసారని.. సినీ నిర్మాత తారలు,స్వంత పార్టీ ఎమ్మెలేల ఫోన్ లు కూడా ట్యాప్ చేసారని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. సిట్ విచారణలో రాజకీయ కక్ష కోణం ఎక్కడా లేదని.. నిజంగా తప్పు చేయకుంటే వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలని అన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ఇచ్చిన సింగరేణి కాంట్రాక్టులు, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన టెండర్లపై చర్చకు రావాలని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. సిఎం బంధువు సృజన్ రెడ్డిపై ఆరోపణలు చేసి దెబ్బ తీయాలనే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.