- మీరు గెలిస్తే ప్రజాస్వామ్యబద్దమా
– జూబ్లీహిల్స్ ఓటమితో కుంగిపోయేది లేదు
– కాంగ్రెస్ విమర్శలపై మండిపడ్డ ఎంపీ ఈటల
హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్ 17:ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సహజమే అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గెలిచినా, ఓడినా.. అధికారం ఉన్నా, లేకపోయినా దశాబ్దాలుగా కాషాయ జండా పట్టుకుని ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. గెలిస్తే బీజేపీ వాళ్ళు ఈవీఎంలను ఏదో చేశారని అంటున్నారు. మరి జూబ్లీహిల్స్ ఎన్నికలో ఈవీఎం మేనేజ్ చేశారా?, దొంగ వోట్లు నమోదు చేయించారా?. తెలంగాణలో, కర్ణాటకలో కూడా రే గెలిచారు, మరి అక్కడ కూడా అలానే చేశారా?. రు గెలిస్తే ఒక న్యాయం.. మేము గెలిస్తే వోట్ చోరీ అని అంటారా?. ఏం చేస్తావో ప్రజలకు చెప్పి వోట్లు అడగాలి, ఇలాంటి ఆరోపణలు కాదు. బరిగీసి కొట్లాడే తత్వం లేనప్పుడు పార్టీ ముందుకు పోయే అవకాశం లేదు. అధికార పార్టీ హంగుల వల్ల ఉపఎన్నికల్లో గెలుస్తుంది. పార్టీ అంటే నాయకులు అందరూ బాధ్యత తీసుకుంటారు. కిషన్ రెడ్డినో, ఇంకొకరినో బాధ్యులు చెయ్యలేం. జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే చనిపోయిన వెంటనే బీజేపీ తిరిగి ఉంటే ఫలితం వేరుగా ఉండేదన్నారు. వేలాది మంది బీజేపీ కారకర్తలు, వందల మంది నాయకుల భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నా.. సీఎం, మంత్రులు, కొంతమంది అవగాహన లేని నాయకులు మాట్లాడుతున్న మాటలు వింటున్నా అని ఎంపీ ఈటల చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. బీజేపీ కార్యకర్తల్లారా.. జూబ్లీహిల్స్ ఎన్నిక ఓడిపోగానే కుంగిపోవద్దని, భవిష్యత్తు మనదే అని అన్నారు. డివిజన్ పాలిటిక్స్‌తో అధికారం లోకి రాలేమని.. కులం, మతం పునాది ద రాజకీయాలు శాశ్వతంగా నడవవన్నారు. ’నారాయణఖేడ్, పాలేరు హుజూర్నగర్, నాగార్జునసాగర్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ అన్నిటిలో అధికార పార్టీ గెలిచింది. కేసీఆర్ అహంకారం అణచడానికి దుబ్బాకలో బీజేపీని గెలిపించారు. అన్యాయానికి న్యాయానికి.. ఆత్మగౌరవానికి అహంకారానికి.. ధర్మానికి అధర్మానికి జరిగిన హుజురాబాద్ ఎన్నికల్లో ధర్మం గెలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఆ ఎన్నిక కోసం ఎదురుచూశారు. స్వయంగా కేసీఆర్ వచ్చి దళితబంధు ప్రకటించినా గెలవలేకపోయారు. తెలంగాణ వచ్చిన తరువాత 9 ఉప ఎన్నికలు జరిగితే 7 సార్లు అధికార పార్టీనే గెలిచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో గెలిచింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార పార్టీ అనేక ప్రలోభాలు పెట్టీ మరీ గెలిచారు. కేసీఆర్ ఎన్ని చేశారో వీరు కూడా అవే చేశారు. కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ లో వచ్చిన వోట్లు 3016. దుబ్బాకలో, మునుగోడు డిపాజిట్ కోల్పోయింది. మరి డిపాజిటు కోల్పోయిన పార్టీ మొన్న ఎలా అధికారంలోకి వచ్చింది. ఒక్క బై ఎలక్షన్ ఓడిపోగానే బీజేపీ పని అయిపోతుందా?. రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారు ఎవరూ అలా మాట్లాడరు’ అని ఎంపీ ఈటల అన్నారు. ’బీహార్ ఎన్నికలు ఒక ప్రభంజనం. ఒళ్ళు వంచి పని చేస్తే విజయం మనదే. కార్యకర్తలు, నాయకులు సోషల్ డియాలో వచ్చే పోస్టులు చూసి బాధపడకండి. భవిష్యత్తు మనదే. జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితం అందరం బాధ్యత తీసుకుంటున్నాం.ప్రజలకు సేవ చేయడం వల్లనే దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజలు వోట్లు వేస్తున్నారు. ఒకాయన అధికారం పోతుందని, ఇంకొకరు సానుభూతితో పోటీ పడ్డారు. తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ తో అధికారంలోకి రాలేము. బీహార్లో మాకు ఇన్ని సీట్లు వచ్చాయి అంటే అందరి మద్దతు ఉంది. ట్రిపుల్ తలాక్ లాంటివి పని చేసాయి అని ఎంపీ ఈటల చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





