రాజ‌కీయాల‌క‌తీతంగా సూర్యాపేట జిల్లా అభివృద్ధి

-స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలి
– పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
– రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట జిల్లాను రాజకీయాలకి అతీతంగా సర్వతోముఖాభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన 79 వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పి కే నరసింహ తో కలిసి రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా  మంత్రి పోలీసులచే గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతకాన్ని ఎగురవేసి, జాతీయ గీతాలాపన, తెలంగాణ రాష్ట్రీయ గీతాలాపన చేసారు. తదుపరి ప్రజలని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే మహాలక్ష్మీ పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించామ‌న్నారు. రాష్ట్రంలో 7,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొన్నాం. సన్నాలకు క్వింటాల్ కు రూ.500 బోనస్‌ ఇస్తున్నామని ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని జిల్లాలో 2024-25 యాసంగి నందు 7 వేల 266 మంది రైతుల వద్ద మొత్తం 50 వేల 816 మెట్రిక్ టన్నుల సన్న వడ్లను కొనుగోలు చేసి రూ. 25 కోట్ల 41 లక్షల వ్యయం గల బోనస్ ను రైతుల ఖాతా లో జమచేసామ‌న్నారు. 70 ఏళ్లుగా పిడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి “సన్న బియ్యం” పంపిణీని ప్రారంభించామని రాష్ట్రం లో 13 వేల కోట్ల రూపాయల వ్యయంతో, 3 కోట్ల 10 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని జిల్లాలో 3 లక్షల 26 వేల 57 ఆహారభద్రతా కార్డుదారులకు జూన్, జులై  ఆగస్టు, నెల‌ల‌కు  18766 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశామ‌న్నారు. జిల్లాలో 2024-25 యాసంగి  నందు (163) ఇందిరా క్రాంతి మహిళా సంఘాల, (144) ప్రాథ‌మిక వ్యవసాయ సహకార సంఘాలు,  (15) మెప్మా సెంటర్ల మరియు (14) రైతు ఉత్పత్తిదారుల సంస్థ కొనుగోలు కేంద్రాలు మొత్తం (336) కొనుగోలు కేంద్రాల ద్వారా 336847 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని 59273 మంది రైతుల నుండి కొనుగోలు చేసి రూ. 783 కోట్లు రైతుల బ్యాంకు ఖాతా లోకి జమ చేశామ‌న్నారు. గత ఏడాది ఇదే ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టామని రాష్ట్రంలోని 25 లక్షల 35 వేల  మంది రైతులకు, రూ.20 వేల 616 కోట్ల రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రాయని కొత్త చరిత్ర రాశామని ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా  రైతుల విషయంలో రాజీ పడలేదని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రైతును రుణ విముక్తి చేసి, దేశంలో అత్యధిక పంట పండిచే దిశగా ప్రోత్సహించామని  జిల్లాలో  ఒక లక్ష 27 వేల 269 మంది రైతులకు రూ.1,005 కోట్ల రుణ మాఫీ చేశామ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *