– నివేదిక తెప్పించి శాసనసభలో చర్చిస్తాం
– రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6ః రాష్ట్రంలో గత పాలకుల హయాంలో అశాస్త్రీయంగా జరిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లను, జిల్లాలను పునర్వ్యవస్ధీకరిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. శాసనసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు రామ్మోహన్రెడ్డి, వీరేశం, పాల్యాయి హరీష్ తదితరులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మండలాల ఏర్పాటు మొదలుకొని జిల్లాల పునర్వ్యవస్దీకరణ వరకు ఇష్టానురీతిలో మొక్కుబడిగా జరిగాయని, దీనివల్ల ఒకే నియోజకవర్గంలోని నాలుగు మండలాలు నాలుగు జిల్లాల్లో ఉండే పరిస్ధితి ఏర్పడిందనిచెప్పారు. అదేవిధంగా తమను పొగిడినవారి కోసం ఒక విధంగా, పొగడని వారికోసం మరో విధంగా, తమ అదృష్ట సంఖ్యను ఊహించుకొని అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేశారన్నారు. ఈ నేపథ్యంలో కొత్త మండలాలు, డివిజన్ల ఆవశ్యకతను కూడా గుర్తించామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గం చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్వ్యవస్ధీకరణ చేపడతామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా నివేదిక తేప్పించి ఇదే శాసనసభలో చర్చించి అందరి ఆమోదంతో పునర్వ్యవస్ధీకరణ చేస్తామని హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



