ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేసి నల్గొండకు నీరు ఇస్తాం

– కేసీఆర్‌ ‌పదేళ్లపాటు పట్టించుకోకుండా నిర్లక్ష్యం
– ప్రజలను పట్టించుకోకుండా నిరంకుశంగా కెసిఆర్‌ ‌పాలన
– కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త రేషన్‌ ‌కార్డులు
– దొడ్డు బియ్యం రద్దు చేసి సన్న బియ్యం ఇస్తున్నాం
-పేదలకు 4.50లక్షల ఇళ్లు మంజూరు చేశాం
– దేవరకొండ సభలో సిఎం రేవంత్‌

‌దేవరకొండ, ప్రజాతంత్ర, డిసెంబరు 6: గత పదేళ్ల బిఆర్‌ఎస్‌ ‌పాలనలో ప్రాజెక్టులను పండబెట్టారని, త‌మ‌ ప్రభుత్వ హయాంలోనే ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తి చేసి నల్గొండ జిల్లాకు నీరు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీఇచ్చారు. ఎస్‌ఎల్‌బీసీను కేసీఆర్‌ ‌పదేళ్లపాటు పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేశారు. ఎస్‌ఎల్‌బీసీ ఆగిందని మామ, అల్లుడు డ్యాన్సులు చేస్తున్నారు. ఎవరూ అడ్డుపడ్డా ఎస్‌ఎల్‌బీసీను పూర్తిచేసి తీరుతాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో రూ.23 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.  పోరాటాల పౌరుషం ఉన్న గడ్డ నల్గొండ. నిజాం నిరంకుశ పాలనను ఎదురించిన జిల్లా నల్గొండ. ప్రజా ప్రభుత్వానికి అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు అని తెలిపారు.  గత ప్రభుత్వం పదేళ్ల పాటు పేదలకు ఒక్క రేషన్‌ ‌కార్డు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త రేషన్‌ ‌కార్డులు ఇచ్చింది. రేషన్‌ ‌కార్డులపై దొడ్డు బియ్యం రద్దు చేసి సన్నబియ్యం ఇస్తున్నాం. పేదల ఆకలి తీర్చినప్పుడే నిజమైన ఇందిరమ్మ రాజ్యం అని మన  ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తోంది. దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. గుజరాత్‌ ‌సహా దేశంలో మరే రాష్ట్రంలోనూ సన్న బియ్యం ఇవ్వట్లేదు. యూపీఏ ప్రభుత్వ హయాములో రాష్ట్రంలో 25లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరిగింది. గత పదేళ్లలో ఎంతమంది పేదలకు ఇళ్లు ఇచ్చారో కేసీఆర్‌ ‌చెప్పాలి. మళ్లీ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రాగానే 4.50లక్షల ఇళ్లు పేదలకు మంజూరు చేశాం. లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పించిందే ఇందిరమ్మ ప్రభుత్వం.కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 25లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసింది. ఒకే విడతలో రూ.2లక్షల చొప్పున రూ.21వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేశాం. రుణమాఫీ పేరిట పదేళ్లపాటు రైతులను కేసీఆర్‌ ‌మోసం చేశారు. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా కేసీఆర్‌ ‌కలిసేవారు కాదు. ప్రగతి భవన్‌, ‌ఫామ్‌హౌజ్‌లోకి ఎవ్వరినీ రానివ్వలేదు.  కానీ, నిన్న ఇద్దరు సర్పంచ్‌లను కూర్చోబెట్టుకుని మళ్లీ మనకు మంచి రోజులు వస్తాయని చెబుతున్నారు. కేసీఆర్‌ ఓడిపోయాకే రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరుగుతోంది. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మంజూరు చేసిన ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును కేసీఆర్‌ ‌పదేళ్లపాటు పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వ హయాంలోనే ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఎస్‌ఎల్‌బీసీ పనులు ప్రారంభించగానే సొరంగంలో దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగింది. సొరంగంలో ప్రమాదం జరిగితే భారత రాష్ట్ర సమితి నేతలు సంబరపడ్డారు. ఏదేమైనా టన్నెల్‌ను పూర్తి చేసి నీరు అందిస్తాం‘ అని సీఎం అన్నారు. ప్రజాపాలన రెండేళ్లు పూర్తిచేసుకుంటున్నామని పేర్కొన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించారు సీఎం రేవంత్‌రెడ్డి. డబుల్‌ ‌బెడ్‌రూం ఇళ్లు ఇస్తానని మాట ఇచ్చి కేసీఆర్‌ ‌మోసం చేశారు. యూపీఏ హయాంలో తెలంగాణలో 25 లక్షల ఇళ్లు మంజూరు చేశారు. ఇప్పుడు తెలంగాణలో 4 లక్షలకు పైగా ఇళ్లు కడుతున్నాం. పదేళ్ల కేసీఆర్‌ ‌పాలనలో ఎన్ని ఇళ్లు ఇచ్చారో చెప్పాలి. కాంగ్రెస్‌ ‌పాలనలో పేదలకు న్యాయం జరగుతుంది. పేదలంటే కేసీఆర్‌కు ఇష్టం ఉండదు. రైతులను కేసీఆర్‌ ‌మోసం చేశారు’ అని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ’మంచిరోజులు వస్తాయని కేసీఆర్‌ అం‌టున్నారు. ఆయ‌న‌ ఓడిపోయాకే ప్రజలకు మంచి జరిగిందని.. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలనూ కలవలేదు. ఫామ్‌హౌస్‌, ‌ప్రగతి భవన్‌కు ఎవరినీ రానివ్వలేదు. ఇప్పుడు సర్పంచ్‌లు, వార్డు మెంబర్లనూ కలుస్తున్నారు. యువతకు 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం. భవిష్యత్‌లో మరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు సభలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *