నిజామాబాద్‌ తిరిగి ఇందూరుగా మార్చి తీరుతాం

– ఇక్కడ కాషాయ జెండా ఎగరేసి తీర్మానిస్తాం
– రాముడికి సభ్యత్వం ఉందంటూ ఎంపి అరవింద్‌ వ్యాఖ్య

నిజామాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 16: నూటికి నూరు శాతం ఇందూర్‌ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగురవేస్తాం.. నిజామాబాద్‌ పేరును ఇందూరుగా మారుస్తాం అని ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు. దీనిపై తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. నిజామాబాద్‌కు ఇందూర్‌ పేరు ఎలా వచ్చిందో చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నారు. విూడియాతో మాట్లాడిన ఆయన దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజాం ఒక హంతకుడు.. నిజామాబాద్‌కి ఆయన పేరు ఎందుకు పెట్టుకుంటారన్నారు. ఇందూరుగా పేరు మార్చి ఆ తీర్మానాన్ని ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డికి పంపిస్తామన్నారు. శ్రీరాముడికి బీజేపీ మెంబర్‌ షిప్‌ ఉందని, అనుమానం ఉంటే వెళ్లి చూసుకోవాలని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌కు తెలిపారు. పహల్గాంలో హిందువులా ..ముస్లింలా అని చూసి కాల్చి చంపారని గుర్తు చేశారు. కొంతమంది హిందువుల్లో చెడ పుట్టారన్నారు. తెలంగాణ మొత్తం కాషాయమయం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎక్కడుందో కవితను అడిగితే చెబుతుందన్నారు. రేపు సిరిసిల్లలో కూడా చూపిస్తామన్నారు. దమ్ముంటే ఇందూర్‌కు రా అని కేటీఆర్‌కి సవాల్‌ విసిరారు. చెన్నారెడ్డి సీఎంగా రాజీనామా చేసే వరకు రాష్ట్రంలో మత ఘర్షణలు జరిగాయని ఎంపీ అరవింద్‌ తెలిపారు. గొడవలకు కారణం కాంగ్రెస్‌.. అప్పట్లో ఏసీపీ సత్తయ్యని చంపితే ఆ నిందితులను బయటకు తెచ్చింది మజ్లిస్‌ అని ఆరోపించారు. తిన్నది అరగక హిందూ దేవాలయాల విూద పడుతున్నారు. దీనికి కారణం రేవంత్‌ రెడ్డి ఇచ్చే దొంగ వాగ్దానాలు అని అన్నారు. . ముస్లింలకు గులాంలుగా మారిపోయి హిందువులను తాకట్టు పెడుతున్నారన్నారు. ముస్లింలకు అవాస్‌ యోజన కింద ఇల్లు, ఫ్రీ రేషన్‌, ఫ్రీ వాక్సినేషన్‌ మోదీ ఇస్తున్నారు.. ముస్లిం దేశాలకు కూడా వ్యాక్సిన్‌ పంపించారు.. విూ పిల్లలకు విద్య, వైద్యం ఇస్తుంది.. నిజాంను అంత వెనుకోసుకొస్తున్న రేవంత్‌ రెడ్డి ఏం చేశారని ఓట్లు వేస్తున్నారు.. ఇన్ని చేసినా మోదీకి ఎందుకు వేయడం లేదు.. ఇదేనా విూ ఇమాందారీ అని ఎంపీ వ్యాఖ్యానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *