నీచ‌రాజ‌కీయాలు బీజేపీ చేయ‌దు

– ప‌దినెల‌ల్లోనే రేవంత్ రాష్ట్రాన్ని ముంచాడు
– కాళేశ్వ‌రం క‌మిష‌న్ విచార‌ణ‌కు హాజ‌ర‌వుతా
– ఈటల రాజేంద‌ర్‌

నీచ రాజకీయాలు చేసే అలవాటు బిజెపికి లేదని బిజెపి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. నీచ రాజీకీయాలు భాజపాకి అలవాటు లేదు. పదేళ్లలో కేసీఆర్‌ను నమ్మి ప్రజలు మోసపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను నమ్మి మరోసారి మోసపోయారు. పక్కరాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. తెలంగాణ వెలవెలబోతోందని వ్యాఖ్యానించారు. అందుకే తెలంగాణలో భాజపా అధికారంలో ఉంటే బాగుండని ప్రజలు భావిస్తున్నారని ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలో ఎవరూ కొత్తగా పార్టీ పెట్టబోరని, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదని తెలిపారు. భాజపా కార్యాలయంలో గురువారం ఆయన డియాతో మాట్లాడారు. భాజపా స్టేట్‌ ‌ఫైట్‌ ‌తప్ప స్ట్రీట్‌ ‌ఫైట్‌ చేయదు. అప్పుల ఊబి నుంచి రాష్ట్రం బయటపడాలంటే భాజపా అధికారంలోకి రావాలన్నారు.  కవిత తెలంగాణ వాదులను కలవడం నేరం కాదు కానీ,  నాయకులు, కుటుంబీకుల ఫోన్లు ట్యాప్‌ ‌చేయడం మాత్రం నేరం. ఇవన్నీ నేర్పించింది కేసీఆర్‌ ‌కాదా? నేతల మధ్య కంచెలు నాటింది కేసీఆర్‌.  ‌దాన్ని  రేవంత్‌ ‌కొనసాగిస్తున్నారు.

కేసీఆర్‌ ఎదురుపడితే నమస్కారం పెడతా. అది సంస్కారం. కాళేశ్వరం కమిషన్‌ ‌విచారణకు బాధ్యతాయతమైన ఎంపీగా, ఆర్థికశాఖ మాజీ మంత్రిగా హాజరవుతానని ఈటల తెలిపారు.భారాస.. భాజపాలో ఎందుకు విలీనమవుతుంది? మేమెందుకు వారిని చేర్చుకుంటాం? ఉద్యమకారులను కలిసి ఎమ్మెల్సీ కవిత ఏం చేస్తారు? కవిత దగ్గర ఉద్యమకారుల జాబితా ఉందా? మావోయిస్టుల అంశంపై కేసీఆర్‌ ‌ద్వంద్వ వైఖరి కనబరిచారు. అధికారంలోకి రాకముందే జైలుకు వెళ్లి.. కూర రాజన్నను కలిశారు. అధికారంలోకి వచ్చాక నెల రోజుల్లోనే ఆయనలో భూమికి, ఆకాశానికి మధ్య ఉన్నంత తేడా వచ్చింది. ఇటీవల నిర్వహించిన భారాస సమావేశంలో అపరేషన్‌ ‌కగార్‌ ఆపాలని కేంద్రానికి లేఖ రాస్తానన్నారు రాశారా అని ఈటల ప్రశ్నించారు.

కవిత జైల్లో ఉన్నప్పుడు విలీనం కోసం బీఆర్‌ఎస్‌ ‌ప్రయత్నం చేసిండొచ్చు. కానీ  బీజేపీ నుంచి ఎవరూ ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులను కలుస్తానని కవిత అంటోందని. కవిత కలిసి ఏం చేస్తదని విమర్శించారు. అందులో కొందరు చనిపోయారని. కొందరు ఇంకెక్కడో ఉన్నారో తెలియదు, మరి కొందరు పార్టీలు మారారని చెప్పారు. రాష్టాన్న్రి పదేళ్లలో కేసీఆర్‌ ‌ముంచితే.. పది నెలల్లోనే రేవంత్‌ ‌ముంచాడని ఎద్దేవా చేశారు. వీళ్లకు మరోసారి ఓటు వేయద్దొని ప్రజలు డిసైడ్‌ అయ్యారన్నారు. పక్క రాష్ట్రం కేంద్ర సహకారంతో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని. ఇక్కడ మాత్రం అప్పులతో ఇబ్బంది పడే పరిస్థితి దాపురించిందన్నారు. రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందాలంటే బీజేపీ వస్తేనే సాధ్యమని అభిప్రాయం వ్యక్తం చేశారు. కవిత విలీనం కామెంట్లపై ఈటల రాజేందర్‌ ‌స్పందించారు. గాలి వార్తలకు నేను ఏం సమాధానం చెప్పాలి. తెలిస్తే చెబుతా కానీ, తెలియకుండా ఏం చెప్పాలి. నేను జిమేదార్‌ ఉన్న రాజకీయ నాయకుడిని. వాస్తవం ఉంటే మాట్లాడతా, లేకుండా మాట్లాడనని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *