భార్య కాపురానికి రావడం లేద‌ని..

– పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య

పెద్దపల్లి, ప్రజాతంత్ర, మార్చి 4: కమాన్‌పూర్‌ ‌మండలం పేరపల్లి గ్రామానికి చెందిన చెప్పాల దేవేందర్‌ (38) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి మంథని ప్రధాన రహదారిలో గల గుండారం గ్రామ శివారులోని పత్తి చేసులో ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ, సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణి సంస్థ ఆర్జీ- 3 పరిధిలోని సెంటినరి లనీ నర్సరీలో ఔట్‌ ‌సోర్సింగ్‌ ‌విభాగంలో పనిచేస్తు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం రాత్రి దేవేందర్‌ ‌పేరపల్లిలోని తన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే గుండారం శివారులోని ఓ పత్తి చేనులో దేవేందర్‌ ‌మృతదేహం కనిపించింది. దేవేందర్‌ ‌గత 15 ఏళ్ల క్రితం పేరపల్లి గ్రామానికి చెందిన మల్లేశ్వరిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు ఆశీష్‌, ‌కుమార్తె కీర్తన ఉన్నారు. భార్యాభ‌ర్త‌ల‌ మధ్య రెండేళ్లుగా విభేదాలున్నాయి. ఏడాదిగా ఇద్దరు పిల్లలతో తన తల్లిగారింటికి మల్లేశ్వరి వెళ్లిపోయింది. అప్పటి నుండి దేవేందర్‌ ‌మానసికంగా కుంగిపోయి మద్యానికి బానిసై మంగళవారం ఈ అఘాత్యానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *