ఫార్మసీ రంగంలో విస్తృత ఉపాధి అవకాశాలు

– అరవిందో ఫార్మసీ డైరెక్టర్ మదన్మోహన్ రెడ్డి 
 కాళోజి జంక్షన్ /హనుమకొండ ప్రజాతంత్ర, డిసెంబర్:  పరిశోధనా రంగంలో ఆసక్తి కలిగిన యువతకు ఫార్మసీలో ప్రపంచవ్యాప్తంగా విస్తృత అవకాశాలున్నాయని అరబిందో ఫార్మసీ డైరెక్టర్ ఎం మదన్మోహన్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని కాళోజి కళాక్షేత్రం ఆడిటోరియంలో కాకతీయ విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల ముగింపునకు శనివారం తొలిరోజు ముఖ్య అతిథిగా ప్రసంగించారు. విద్యార్థులు, అధ్యాపకులకు స్ఫూర్తినిచ్చే ప్రసంగాన్ని అందించి ఉత్తేజపరిచారు. గొప్ప కళాశాల అంటే భవనాలు కాదని విద్యార్థులకు అధ్యాపకుల బోధన, కలిగించే ఆసక్తి, సృజన ముఖ్యమైందన్నారు. ఫార్మసీ కళాశాల లాంటి పరిశోధనాలయాల లో నాణ్యతా, భద్రత, విలువలు మాత్రమే గీటు రాయి అన్నారు,మ. ఫార్మసిస్ట్ అంటే డాక్టర్ కంటే ఎక్కువ అన్నారు. రోగిని రక్షించే మందులను అందించేది ఫార్మసిస్ట్ అన్నారు. కాకతీయ గొప్ప విశ్వవిద్యాలయమని కొనియాడారు. ఫార్మసీ విభాగ పరిశోధనలను అభినందించారు. విశ్వవిద్యాలయ ఫార్మసీ విభాగానికి గొప్ప పునాదులు వేసిన మొదటి తరం అధ్యాపకులు, కొనసాగిస్తున్న ప్రస్తుత అధ్యాపక వర్గం గొప్పది అన్నారు. అరబిందో సంస్థ చాలా తక్కువ మూలధనం తో కెమిస్ట్ గా ఉత్పత్తిదారుగా మొదలైంది అన్నారు. నేడు ప్రపంచస్థాయిలో నాణ్యతా ప్రమాణాలు కలిగిన సంస్థగా అవతరించిందన్నారు. విద్యార్థి కి పుస్తకాలు మాత్రమే కాదని జీవిత అనుభవాలు అవసరమేనన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయ ఫార్మసీ విద్యార్థులు దేశం లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించారన్నారు. ఆమెరికా లోని ప్రతి 10 ప్రిస్క్రిప్టిన్లలో ఒకటి అరబిందోదే ఒకటి ఉంటుందన్నారు. ప్రపంచం లోనే భారత ఫార్మా రంగం చాలా గొప్పది అన్నారు. 2034 వరకు ప్రస్తుత పేటెంట్ లు కాలం చెల్లుతాయన్నారు. జెనిరి్ ఔషధాలు ప్రధాన భూమిక వహిస్తాయి అన్నారు. చైనా, యరోప్ దేశాలకు దీటుగా, సరసమైన ధరలో ఇవ్వటం లో ముందు వరుస లో భారత దేశం నిలుస్తుందన్నారు. సబ్జెక్టు ఒక్కటే కాదని ఇండస్ట్రి అనుభవం, ఎగ్జిబిషన్ లు, క్వాలిటి చెక్ లు, ఉత్పత్తి యూనిట్ లు దర్శించాలన్నారు. రానున్న 50 ఏళ్ళలో విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాల ఇండస్ట్రీతో అనుసంధానమై ఎక్సలెన్స్ దీశగా అడుగులు వేయాలన్నారు. గౌరవ అతిదిగా పూర్వపు విద్యార్థి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మాజీ సంచాలకులు డాక్టర్ మన్సూర్ ఖాన్ మాట్లాడుతూ ప్రారంభం లో విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాల లో వసతుల లేమిలో చాలా నేర్చుకున్నామన్నారు. క్రమశిక్షణ గల అధ్యాపకులు, మంచి స్నేహితుల సాంగత్యం ఉన్నతస్థితికి తీసుకు వెళ్ళింది అన్నారు. దేశ విదేశాలలో ఎన్నో ఫ్యాక్టరీ లు స్థాపించినట్టు, అవరోధాలను అవకాశాలుగా మార్చుకొన్నామన్నారు. వైస్ చాన్సలర్, గోల్డెన్ జూబిలీ చీఫ్ ప్యాట్రన్ ఆచార్య కే . ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయానికి ముందు దారి చూపిన కాలేజీ ఫార్మసి కాలేజీ అని కొనియాడారు. గొప్ప టీచర్ లు, ప్రపంచ స్థాయి పరిశోధన, ప్రపంచ వ్యాప్త విద్యార్థి ప్రగతి ఉన్న కళాశాల గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థుల ను గుర్తు చేశారు. కార్యాచరణ, పని లో భాగస్వాయం తోనే ఈ స్థాయి కి చేరుకోగలిగింది అన్నారు. 3 వేల మంది బి. ఫార్మసీ, 1800 మంది ఏం. ఫార్మసీ, 400 మంది పి. హెచ్,డి. 3వే లకు పైగా గొప్ప పరిశోధన పత్రాలు కళాశాల గొప్పతనం ను ప్రపంచానికి చాటిందన్నారు. యూనివర్సిటీ, అట్లాంటా, హైదరాబాద్ లో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు అభినందనీయం అన్నారు. జాతీయ స్థాయి ర్యాంకులు నిలబెట్టుకుందన్నారు. నిధులు, అధ్యాపకలు కొరత ఉన్నప్పటికీ ముందు వరుసలో ఉంది అన్నారు. ఈ కార్యక్రమం లో ఆచార్య వి. మల్లారెడ్డి మాట్లాడుతూ కళాశాల భవిష్యత్ బ్రహ్మాండంగా ఉంటుందన్నారు. విశ్వవిద్యాలయనికి కీర్తి, ప్రతిష్టలు తేవాలన్నారు. ఆచార్య వి. కిషన్, కళశాల ప్రిన్సిపాల్ ఆచార్య జె. కృష్ణవేణి మాటాల్డుతూ “పూర్వ విద్యార్థులు తమ వంతు సహకారం అందించలన్నారు. ఆచార్య గాదె sammaiah మాటలాడుతూ విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాల టీచర్ లు రోల్ మాడెల్ గా ఎంచుకున్నరు అనరు, 15.00 కోట్ల రుసా నిధులు పరిశోధనలకు ఊతం పలుకుతాయి అన్నారు, ఆచార్య ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ బెస్ట్ ఆఫ్ దీ బెస్ట్ గా సేవలు చేద్దాం అన్నారు, పూర్వపు అధ్యపకులను, ప్రస్తుత అధ్యపకులను, ఒప్పంద అధ్యాపకులను శాలువా, జ్ఞాపిక, తో వేద మంత్రాల మధ్య అతిదులు, అధికారులు సన్మానించారు, కళాశాల పూర్వ విద్యార్థి, అమెరికా సంయుక్త రాష్ట్రాల నివాసి, ప్రవాస భారతీయుడు కన్వీనర్ డాక్టర్ సాంబా రెడ్డి సంయోజకులు గా వ్యవహరించారు, తన స్వాగత ఉపన్యాసం లో కళశాల తనకు అన్నీ అందించింది అని తన కృతజ్ఞత తెలిపారు, పూర్వ విద్యార్థులు తమ సమయాన్ని, ఆలోచన ను, సహాయాన్ని అందించాలి అన్నారు, కార్యక్రమంలో డాక్టర్ రమణ కుమారి, డాక్టర్ ఏ. రామ కిషన్, డాక్టర్ జి.రామ్ ధన్, పలువురు విశ్రాంత ఆచార్యలు, బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం కూడా కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.
—————————————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *