బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి కేటీఆర్ ప్రశ్న
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 11 : భద్రాచల రామచంద్రస్వామి ఆలయ భూములు ఆంధ్రప్రదేశ్‌లో కబ్జా కావడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామచంద్రస్వామి భూములు కబ్జా అయినా బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రామచందర్‌రావు ఎందుకు మాట్లాడడం లేదని ‘ఎక్స్’లో ప్రశ్నించారు. 889 ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్‌లో కబ్జా అయినా బీజేపీ నుంచి ఒక్క నాయకుడు కూడా మాట్లాడడం లేదన్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు రామచంద్రరావుకు సమయం లేదా లేక రాజకీయ ప్రయోజనాలు కాపాడుకునేందుకే మౌనంగా ఉంటున్నారా అని నిలదీశారు. రాజకీయ పొత్తులు పక్కనపెట్టి భద్రాచల దేవస్థానం భూములను కాపాడేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. దేవస్థానం భూముల వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేసేలా చూడాలన్నారు.
రాముడి భూముల కబ్జాపై మాట్లాడరేం?





