– హామీలపై నిలదీస్తున్న బీఆర్ఎస్
– ఉనికి చాటేందుకు బీజేపీ యత్నం
– కాంగ్రెస్-బీఆర్ఎస్ -బీజేపీల మధ్య త్రిముఖ పోటీ
(మండువ రవీందర్ రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)
రాష్ట్రంలోని పురపాలక, నగరపాలక, కార్పొరేషన్ ఎన్నికలకు అంతా సోమవారంతో ప్రచార కార్యక్రమం ముగిసి, నిద్ధమైంది. బుధవారం వోటింగ్ ప్రక్రియకు ఇటు ప్రభు త్వ యంత్రాంగం, అటు రాజకీయ పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ని 116 మున్సిపాలిటీలకు, ఏడు కార్పొరేష న్లకు జరుగనున్న ఎన్నికల్లో దాదాపు 52 లక్షలకు పైగా వోటర్లు తమ వోటు హక్కును -వినియోగించుకోనున్నారు. ఎన్నికల నోటిఫి కేషన్ విడుదల నుంచి ప్రచారపర్వం ముగిసే
వరకు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపునకు తీవ్రస్థాయిలో ప్రచారం చేశాయి. ఈ ఎన్నికల్లో ఎదుటి పార్టీ లను మట్టి కరిపించాలన్న పట్టుదలతో అన్ని పార్టీల నేతలు పదునైన విమర్శనాస్త్రాలతో విచురుచుకుపడ్డారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్ను ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పాటు బీజేపీలు ఢీకొట్టేందుకు వ్యూహత్మక ప్రచారాలను నిర్వహించాయి. మున్సిపల్ ఎ న్నికలే అయినప్పటికీ అన్ని పార్టీలకు చెందిన బడా నేతలు ఈ ప్రచార పర్వంలో పాల్గొన డం విశేషం. కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించు కునేందుకు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఇతర మం త్రులు, ఎంపీలు, ఎంఎల్ఎలు, ఎంఎల్సీలు, ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలు కాలుకు బలపం కట్టుకుని తిరిగారు. బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతా తానే అన్నట్లుగా రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతా ల్లో సభలు, సమావేశాలు నిర్వహించి కాంగ్రె స్ అధికారంలోకి వచ్చే ముందు చేసిన వాగ్దా నాలను మరిచిన విషయాన్ని ప్రజలకు గుర్తుచేస్తూ వచ్చారు. పార్టీ సీనియర్ నాయకుడు, ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్రరావుతోపాటు పార్టీ ఎంఎల్పి లు, ఎంఎల్సీలు, ఇతర నేతలు విస్తారంగా ప్ర చార కార్యక్రమంలో పాల్గొన్నారు. బిజెపికూడా తన ఉనికిని చాటుకునేవిధంగా కృషిచేసింది. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తోపాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా ప్రచా ర కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ
మూడు ప్రధాన పార్టీలు ఎవరి ధీమాను వారు వ్యక్తంచేస్తూ వచ్చాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి వారు తామే అత్యధిక స్థానాలను కైవ సం చేసుకుంటామని చెబుతున్నారు. రాష్ట్ర ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ విషయంలో ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పురపాలక సంఘాల ఎన్నికల్లో 90శాతం సంఘాలపై తమ పార్టీ జండా ఎగురవేస్తుందంటున్నారు. ప్రగతి బాట పేర ఆయన రాష్ట్రంలోని వివిధ ప్రాంతా ల్లో పర్యటించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం, ఆయా జిల్లాల అభివృద్ధి నిధు లను మంజూరు చేయడం ఆ పార్టీకి కలిసిరా వచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నిటికి మించి ఆయన బిఆర్ఎస్, బిజెపిపైన విరుచుకుపడిన విధానంలో కొన్నిసార్లు అదుపు తప్పి మాట్లాడినతీరుపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నది. ఇదిలా ఉంటే బిఆర్ఎస్ కూడా అందుకేమీ తీసిపోకుండా విమర్శనాస్త్రాలను సందించింది. ఒకవైపు సీఎం రేవంత్రెడ్డి తిట్లకు తగినట్లు స్పందిస్తూనే, మరోపక్క ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన హామీల విషయం లో నిలదీస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, జాబ్ క్యాలెండర్, రైతుభరోసా, గురుకులాల్లో విద్యా ర్థుల మరణాలు, సింగరేణి కుంభకోణం తది తర అంశాలగురించిన ప్రశ్నలువేస్తూ ప్రజల నుండి అవేవీ తమకు అందలేదన్న సమాధా నా న్ని రాబడుతూ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయ త్నాలు చేశారు బిఆర్ఎస్ నాయకులు. గత అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్కు కాళేశ్వరం కృంగివేత కలిసి వచ్చినట్లు, ఈ ఎన్నికల సమ
యంలో ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్ధం సంఘటన బిఆ ర్ఎస్కు కలిసి వచ్చింది. ఓటుకు నోటు కేసు, ఎంఎల్ఎల కొనుగోలు లాంటి కీలక కే సులకు సంబందించిన సమాచారాన్ని కావాలనే అధికా రపార్టీ దగ్ధంచేసిందన్న ప్రచారాన్ని బిఆర్ఎస్ విస్తృతం చేసింది.
శాసనసభ, పార్లమెంటు ఎన్నికలతోపాటు నిన్నమొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నిలదొ క్కుకుంటూ వస్తున్న భారతీయ జనతాపార్టీ ఈ ఎన్నిక)ను కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుం ది. ఆ భరోసాతోనే గత ఎన్నికలు భిన్నంగా ఈసారి ఆ పార్టీ దాదాపు అన్ని స్థానాలకు పోటీ పెట్టింది. కాగా తమ అభ్యర్థుల తరపున కేంద్ర నాయకత్వాన్నికూడా ఆహ్వానించింది. మహ బూబ్నగర్ లో ఆ పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీర్ ప్రచారం నిర్వహించగా, సిర్పూర్ కాగజ్నగర్ లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్న వీస్ పాల్గొన్నారు. కాగా ఆ పార్టీకున్న ఆరుగు రు ఎంఎల్ఎలు, ఆరుగురు ఎంపీలు విస్తృత ప్రచారం చేశారు. నేడు బుధవారం జరుగనున్న ఎన్నికలు పార్టీల భవిష్యత్ను నిర్ణయిస్తాయన్న టాక్ వినిపిస్తున్నది. గత పదేళ్ళ బిఆర్ఎస్ పాలన లేక రెండేళ్ళ కాంగ్రెస్ పాలనకా, ప్రజలు దేనికి పట్టం కడుతారన్నది ఈ నెల 13న తేలనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





