పేద‌ల‌కు గృహ భ‌ద్ర‌త క‌ల్పన ప్ర‌భుత్వ బాధ్య‌త‌

~ ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: నిరుపేద కుటుంబాలకు గృహ భద్రత కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, నియోజకవర్గంలో ఇల్లు లేని అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలనే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల అయిలయ్య తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణం యాదగిరిపల్లి పోచమ్మవాడకు చెందిన రహీం–రజియా దంపతుల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివసిస్తున్న తమ కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య  హామీ మేరకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకోవడం తమ జీవితంలో మరిచిపోలేని ఆనంద క్షణమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన‌ నిలబడి నిజమైన ప్రజా పాలన అందిస్తోందన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు మేకపోతు, పట్టు వస్త్రాలను అయిల‌య్య అందజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *