- రూ.22కోట్లతో హాస్పిటల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,
ఎర్రుపాలెం, ప్రజాతంత్ర, మే 14 : కాంగ్రెస్ ప్రభుత్వం తోనే ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎర్రుపాలెం మండలంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఎర్రుపాలెం మండల కేంద్రంలో 22 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 50 పడకల హాస్పిటల్‌కి శంకుస్థాపన చేశారు.బనిగండ్లపాడు గ్రామం నుండి బంజర గ్రామం వరకు ఐదు కోట్ల 74 లక్షల వ్యయంతో నిర్మించనున్న బిటి రోడ్డుకు పెద్ద గోపవరం గ్రామం నుండి కండ్రిక గ్రామం వరకు రెండు కోట్ల 74 లక్షలు వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు కు బుధవారం శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇల్లు ఇస్తామని గత టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో నాయకులు 10 సంవత్సరాలు మోసం చేశారన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామన్నారు.రైతు రుణమాఫీ, రైతు భరోసా, రాజీవ్ యువ వికాసం, సన్న బియ్యం ఇలా ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వేల కోట్లు ఖర్చు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి ప్రభుత్వం ఖర్చు చేసిన వివరాలు లెక్కల తో సహా త్వరలో వెల్లడిస్తాం అన్నారు.ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే పదేళ్లు పాలించిన వారు రాష్ట్రాన్ని గాలికి వొదిలేసి 7 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లిపోయారని విమర్శించారు.
ఆదాయం లేకపోయినా, అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ మొదటి ఏడాదిలోనే పెద్ద సంఖ్యలో ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్య శాఖకు రూ.11,600 కోట్లు ఖర్చు పెడుతున్నామని రాబోయే రోజుల్లో వైద్య రంగానికి మరింత నిధులు కేటాయిస్తాం అన్నారు. మొదటి సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో 3500 ఇల్లు నిర్మించేందుకు రూ.22,500 కోట్లు కేటాయించాం అన్నారు. అడవి హక్కు చట్టం ద్వారా పట్టా పొందిన రైతులందరికీ ఇందిరా గిరి జలవికాసం ద్వారా ఉచితంగా బోర్లు, పంప్ సెట్లు, సోలార్ విద్యుత్తు, పామ్ ఆయిల్, అవకాడో మొక్కలు ఉచితంగా అందజేస్తామన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు.
అందులో భాగంగా మొదటి సంవత్సరం స్వయం సహాయక సంఘాలకు 21 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తాం అన్నారు. రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద వారందరికీ 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. గతంలో పెద్ద రోగం వస్తే ఇల్లు వాకిలి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచామన్నారు.కొన్ని కొత్త చికిత్సలను చేర్చి రాష్ట్ర ప్రజలకు ప్రజా ప్రభుత్వం భరోసా ఇచ్చామన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి వందరోజుల పని కల్పించి, అదే కుటుంబంలో పిల్లలు చదువుకునేందుకు ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటుచేసి నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా స్కూల్ నిర్మిస్తాం అన్నారు. ఈ పాఠశాల నిర్మాణానికి 11,600 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న పిల్లలు చదువుకుంటే వారి ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తున్నాం అన్నారు. 90 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నాం అన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 2 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కలిగిస్తున్నాం అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి ఇప్పటికే 56 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం, మరో 30 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నాం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు యువత తమ కాళ్లపై తాము నిలబడేందుకు 9,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకానికి ప్రారంభించామని, జూన్ 2న సాంక్షన్ లెటర్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్, ముజ్మిల్ ఖాన్, ఆర్డీవో. నరసింహారావు, జిల్లా వైద్యాధికారి, కళావతి భాయ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పువ్వాళ్ళ. దుర్గాప్రసాద్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, వేజెండ్ల.సాయికుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, సౌజన్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వేమిరెడ్డి.సుధాకర్, రెడ్డి, నాయకులు అనుమోలు.వెంకటకృష్ణారావు, ఐలూరి.రంగారెడ్డి, తల్లపురెడ్డి, నాగిరెడ్డి, చావా రామకృష్ణ, మూల్పూరి.శ్రీనివాసరావు, కె.వెంకట్ నర్సయ్య, షేక్ ఇస్మాయిల్, శీలం.శ్రీనివాసరెడ్డి, పిచ్చిరెడ్డి, జి.బాబురావు, మొగిలి.అప్పారావు, అక్కిరెడ్డి, జంగా.ప్రసాద్ రెడ్డి, పుల్లారెడ్డి, కృష్ణారెడ్డి, సత్యనారాయణరెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.



