మరియు వాతావరణ హెచ్చరికలు :
సంచాలకులు, హైదరాబాద్ వాతావరణ కేంద్రం
వాతావరణ విశ్లేషణ Meteorological Analysis :ఆదివారం ఉదయం 08:30 ఆధారంగా :
నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రాంతం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి శనివారం సాయంత్రం ఉత్తరాంధ్ర దాని సమీపంలోని దక్షిణ ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతమై అటుపిమ్మట ఈరోజు ఉదయం సుమారు ఐదు గంటల 30 నిమిషాలకు ఉత్తర తెలంగాణ దాని సమీపంలోని విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 4.5 కి మీ ఎత్తువరకు కొనసాగుతూ ఎటు పెరిగే కొద్దీ దక్షిణ దిక్కుకు వాలి ఉంది. ఈ అల్పపీడనం తదుపరి పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మధ్య విదర్భ దాని పరిసరాలలో కదిలి అటుపై ఉత్తర దిశలో కదిలి ఉపరితల ఆవర్తనంగా బలహీనపడే అవకాశం ఉంది. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడన ప్రాంతం నుండి దక్షిణ మహారాష్ట్ర వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు ఉత్తర తెలంగాణ సమీపంలోని విదర్భ ప్రాంతంలోని అల్పపీడన ప్రాంతం నుండి ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1 నుండి 4.5 కి మీ మధ్యలో కొనసాగుతోంది.
*నైరుతి రుతుపవనాలు సాధారణ తిరోగమన తేదీ అయిన సెప్టెంబర్ 17 కంటే మూడు రోజులు ముందుగా ఆదివారం పశ్చిమ రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల నుండి ఉపసంహరించాయి.
* నైరుతి రుతుపవనాల తిరోగమన రేఖ ఈరోజు 30.5 ఉత్తర అక్షాంశం 73.5 తూర్పు రేఖాంశాల మీదుగా శ్రీ గంగానగర్ నాగపూర్ , జోద్పూర్, బార్మార్, మీదుగా కొనసాగుతోంది. రాగల రెండు మూడు రోజులలో రాజస్థాన్ రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలు పంజాబ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు ఉపసంహరించేందుకు అనుకూల వాతావరణం ఉంది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast): ఈరోజు , రేపు మరియు,ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు రాష్ట్రంలోని చాలా జిల్లాలలో కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది*
వాతావరణ హెచ్చరికలు (weather *warnings): ఈరోజు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈరోజు రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు మరియు గంటకు 30 నుంచి 40 కి మీ వేగంతో ఈదురుగాలులు తో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కి.మీ వేగం కలిగిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.




