– ఎప్పుడూ లేనంతగా నిధుల కేటయింపు
– రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రి సీతక్క
ములుగు, ప్రజాతంత్ర, జనవరి 7: గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, గతంలో ఎప్పుడూ లేని విధంగా రేవంత్ నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం పాటుపడుతోందని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. చదువులతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా, స్థానిక డీడీ దబ్బకట్ల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే ఆదివాసీల ఆత్మగౌరవం, అస్తిత్వానికి ప్రతీకగా మేడారం జాతర రూపుదిద్దుకుంటుందని, జాతర పవిత్రతను కాపాడాలని మంత్రి సీతక్క సూచించారు. పూజారులు, ఆదివాసీ సంఘాల నాయకుల సమన్వయంతో జాతర విజయవంతం చేయాలన్నారు. జాతర నిర్వహణపై ఆదివాసీ సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను తెలపాలని సూచించారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసం మేడారం జాతర కలకలాం గుర్తుండిపోయేలా ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకుంటుందని వెల్లడించారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చేటప్పుడు ఆదివాసీ యువజన సంఘాలు సమన్వయం పాటించాలని, వలంటరీ సభ్యులకు, మహిళలకు ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. జాతర సమయంలో ఇసుక లారీల రవాణాను పూర్తిగా నిలిపివేయనున్నట్లు వివరించారు. జాతరకు వచ్చే భక్తులు ఏ విధంగా దర్శనం చేసుకోవాలనే అంశంపై ప్రత్యే క రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించామని అన్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా జాతరకు ఏర్పాట్లు చేస్తున్నామని, అభివృద్ధ్దిక శ్రీకారం చుట్టామని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



