బీసీ రిజర్వేషన్లపై త‌గ్గేదే లేదు

– ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాం
– అవసరమైతే న్యాయపోరాటం
– కేంద్రం దీన్ని త‌క్ష‌ణం ఆమోదించాలి
– రామచంద్రరావు లీగల్‌ ‌నోటీసులకు బెద‌రం
– మీడియాతో డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై న్యాయపరమైన సమస్యలు వొస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కులగణన సర్వే ఆధారంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బిసి రిజర్వేషన్లలో వెనక్కి త‌గ్గే ప్రసక్తి లేదని అన్నారు. కులగణన అవసరం లేదని భాజపా మొదట మాట్లాడింది. తెలంగాణ ప్రభుత్వం, రాహుల్‌ ‌గాంధీ ఒత్తిడితో జనగణనలో కులగణన చేరుస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ బిల్లుకు పార్లమెంట్‌లో అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తాం. కులగణనను క్యాబినెట్‌లో, శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించాం. అసెంబ్లీలో మద్దతు తెలిపిన పార్టీలు పార్లమెంట్‌లోనూ మద్దతు తెలపాలి. ఆర్డినెన్స్ ‌గవర్నర్‌ ఆమోదం పొందగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ముందుకెళ్తాం అని అన్నారు.  రాష్ట్రంలో నిర్వహించిన కులగణన ఆధారంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గవర్నర్‌ ఆర్డినెన్స్ ‌జారీ చేయగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ముందకెళ్తామని స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని, అసెంబ్లీలో మద్దతు తెలిపిన పార్టీలు పార్లమెంట్లో కూడా పోరాటం చేయాలని కోరారు. ఈ బిల్లు త్వరగా ఆమోదం పొందే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని రాహుల్‌ ‌గాంధీ హా ఇచ్చారని.. ఆయన చెప్పిన మాట ప్రకారమే రాష్ట్రంలో  అధికారంలోకి రాగానే కుల గణన నిర్వహించామని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో కులగణన అంశం తెరపైకి రావడంలో తెలంగాణ రాష్ట్రానిది కీలక పాత్ర అని పేర్కొన్నారు. తెలంగాణలో కులగణన చేసిన తర్వాతే దీనిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైందన్నారు. కులగణన సర్వేను చాలా పకడ్భందీగా, పారదర్శకంగా నిర్వహించామని అందుకే తెలంగాణను చూసి కేంద్ర ప్రభుత్వం కూడా కుల గణన చేస్తామని ప్రకటించిందన్నారు. తెలంగాణ జరిగిన విధానమే రేపు దేశవ్యాప్తంగా అమలు కానుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కులగణన, జనగణన చేయడానికి ఇంకా చాలా సమయం ఉందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఏవైనా న్యాయపరమైన సమస్యలు వస్తే ఎదుర్కొవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోందన్న‌ ఆశాభావం వ్యక్తం చేశారు.భారత రాష్ట్ర సమితి ప్రజలను మభ్యపెట్టింది. అందరూ అలాగే చేస్తారని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారేమో. కులగణన సర్వేను చాలా పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాం. అందుకే తెలంగాణను చూసి కేంద్రం కూడా కులగణనను ప్రకటించిందని భట్టి అన్నారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు రామచందర్‌రావుకు బీసీలంటే చిన్నచూపు ఉన్నట్లుంది. ఆయన పంపిన లీగల్‌ ‌నోటీసులకు ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు.  నోటీసులకు భయపడేది లేదని కౌంటర్‌ ఇచ్చారు. నోటీసులు అందిన తరువాత  ఏవిధంగా సమాధానం చెప్పాలో తనకు తెలుసన్నారు. రామచందర్‌ ‌రావుకి దళితులన్నా బడుగు బహీన వర్గాలన్నా చిన్న చూపని విమర్శించారు. రోహిత్‌ ‌వేముల ఆత్మహత్య చేసుకోవడానికి రామచందర్‌ ‌రావు కూడా  కారణమంటూ ఇటీవల  భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రివార్డుగా బీజేపీ అధిష్టానం ఆయనకు  తెలంగాణ చీఫ్‌ ‌పదవి ఇచ్చిందని ఆరోపించారు.  రామచందర్‌ ‌రావుకు  తెలంగాణ చీప్‌ ‌పదవి ఇవ్వడంపై బీజేపీ అధిష్టానం ఒకసారి పునరాలోచించాలని భట్టి అన్నారు. భట్టి వ్యాఖ్యలను తప్పుబట్టిన రామచందర్‌ ‌రావు తన న్యాయవాదితో లీగల్‌ ‌నోటీసులు పంపించారు. మూడు రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని.. లేకపోతే రూ.25 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని రామచందర్‌ ‌రావు నోటీసుల్లో  హెచ్చరించారు. దీనిపై క్రిమినల్‌ ‌కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *